STORYMIRROR

sesi saradi

Abstract Drama Tragedy

4  

sesi saradi

Abstract Drama Tragedy

సమాంతర రేఖలు

సమాంతర రేఖలు

1 min
312

కొన్ని జీవితాలు

సమాంతర రేఖలు

కలసి నడుస్తున్నా

కలయిక లేని

దౌర్భాగ్య జీవులు

ఎన్నో ఏళ్లుగా ఒకరిమీద ఒకరికి

ఎంత అభిమానమున్నా

కలిసి బ్రతకాలనే కాంక్ష ఉన్నా

సాధ్యం కాని దురదృష్ట జీవికలు .

కొన్ని జీవితాలు సమాంతర రేఖలు

రైలు పట్టాలలాగా

పక్క పక్కనే నడుస్తున్నా

చేయి అందించలేని

అందుకోలేని

నిస్సహాయ జీవులు .

కొన్ని జీవితాలు సమాంతర రేఖలు

ఒకరిపై ఒకరికి ఎంత

ఆరాధన ఉన్నా

విడి విడి గానే గమ్యం వేపు

పయనం సాగించే

బాధా తప్త హృదయులు.

కొన్ని జీవితాలు సమాంతర రేఖలు

విధి ఆడే వింత నాటకమో స్వయంకృతాపరాధమో

పూర్వ జన్మ కర్మ ఫలమో

కానీ ,

కొన్ని జీవితాలు

సమాంతర రేఖలు

కలసి నడుస్తున్నా,

కలయిక లేని

దౌర్భాగ్య జీవులు .


Rate this content
Log in

Similar telugu poem from Abstract