STORYMIRROR

sesi saradi

Romance Classics Others

4  

sesi saradi

Romance Classics Others

నిరీక్షణ

నిరీక్షణ

1 min
323

నిరీక్షణ 


డాబాపై రాత్రి వేళ 

నీ చేయి పట్టుకొని కూర్చుని

 నీలాకాశంలో చుక్కలను

 లెక్కించాలని ఉంది .


పెరట్లో నీ ఒళ్ళో తల పెట్టుకుని

 కొబ్బరాకుల మధ్య నుంచి 

తొంగి చూస్తున్న జాబిల్లితో 

మాట్లాడాలని ఉంది 


నీ హృదయంపై 

నా చెవిని ఆనించి

నీ గుండె చేసే 

సవ్వడి వినాలని ఉంది 


ఖాళీగా ఉన్న రహదారిపై

 నీ భుజంపై తలవాల్చి

 నీ ముఖాన్నే చూస్తూ

 నడవాలని ఉంది .


కోవెలలో దైవ దర్శనం తర్వాత 

కోనేరు గట్టుపై కూర్చుని

 కొబ్బరి ప్రసాదం నీతోనే

 పంచు కోవాలని ఉంది .


నిరీక్షణ తోనే నా జీవితకాలం

 పూర్తి అవుతున్నా

 ఇంకా నీ కోసం

 ఎదురు చూడాలనే ఉంది 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance