STORYMIRROR

sesi saradi

Abstract Drama Tragedy

4  

sesi saradi

Abstract Drama Tragedy

బొమ్మను నేను!

బొమ్మను నేను!

1 min
226


మనిషిని కాను నేను

 బొమ్మను

 మనసన్నదే లేని 

మట్టి బొమ్మను నేను!


 భర్త ఆదేశాలను

 ఆలోచించ కుండా 

 అనుసరించే బొమ్మను నేను!

మర బొమ్మను నేను!


అంతు లేని పనితో, అనారోగ్యంతో 

ఎప్పుడు పగిలి పోతానో 

తెలియని బొమ్మను  నేను!

గాజు బొమ్మను నేను !


అందరికీ సేవలు చేసి 

కొవ్వొత్తిలా కరిగి పోతున్న

బొమ్మను నేను!

 మైనం బొమ్మను నేను !


స్వంతంగా ఏ పని చేసినా 

విమర్శలు ఎదుర్కుంటున్న

బొమ్మను నేను!

 గుడ్డ బొమ్మను నేను !


పని చేసి గుర్తింపు

 లేదని బాధపడే 

బొమ్మను నేను!

 కర్ర బొమ్మను నేను 


నీకు మెదడే లేదు అనే

వెటకారం మాటలు వింటూ కూడా 

మౌనంగా ఉండిపోతున్న 

బొమ్మను నేను,

 మూగ బొమ్మను నేను !


చని పోయిన తర్వాతయినా

నా విలువ అందరికీ తెలుస్తుందని 

ఆశ పడుతున్న బొమ్మను నేను

 తోలు బొమ్మను నేను !





రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract