STORYMIRROR

Midhun babu

Abstract Romance Others

3  

Midhun babu

Abstract Romance Others

అందాల రాముడు

అందాల రాముడు

1 min
8


  

ధర్మరూపుడై వనితను చంపిన తెలివి అందం..

వైదేహికై శివ ధనువు విరిచిన ప్రేమ అందం..


రాజభోగాలు మాటకై విడిచిన అజ్ఞత అందం..

రాజ కొడుకై బోయను తడివిన పవిత్రత అందం..


శత్రువుచే స్తోత్రమందిన విచిత్రత అందం..

మిత్రుని అన్నను కూల్చిన న్యాయము అందం..


శాంతుడై జలధునిపై శరమెత్తిన శాంతి అందం..

బ్రహ్మ వంశజుని వధకై వారధి బంధన అందం..


యుద్ధములో క్షమాధర్మం చూపిన పిచ్చి అందం..

అర్థంపర్థంలేక సీతకు స్వేచ్ఛ అనే మాట అందం..


రాఘవ కవిచే వ్యాజస్తుతందే అమాయకత్వం అందం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract