ఎందుకట
ఎందుకట
నీతోనే ఉన్నానా..గ్రంథాలయం ఎందుకట..!?
నాతోనే ఉన్నానా..దేవాలయం ఎందుకట..!?
పరిమళించు నవమల్లెల..వానకదా నీ నవ్వే..
నిను చూస్తు ఉన్నానా..ఊహాలయం ఎందుకట..!?
విరజాజుల వనమంటే..ఒక్కచిన్ని నీ తలపే..
ఓ సాక్షిగ ఉన్నానా..విషయాలయం ఎందుకట..!?
పారిజాత పరవశాల..వెన్నెలింటి ముగ్ధవేమొ..
గమనిస్తూ ఉన్నానా..హిమాలయం ఎందుకట..!?
ఛత్రమైన గగనానకి..ఎవరి చేయి తోడున్నది..
నాట్యంలో ఉన్నానా..నటనాలయం ఎందుకట..!?

