పరమార్థం
పరమార్థం
చిత్తశుద్ధి పూలచెట్టు..మనసైతే పరమార్థం..!
స్వచ్ఛమైన చిరునవ్వే..నీవైతే పరమార్థం..!
ఏదిపడితె అది పలికిన..నీ శక్తికి విఘాతం..
ప్రతి మాటా మౌనపు..హరివిల్లైతే పరమార్థం..!
పాండిత్యం ఉన్నంతనె..జీవితమేం పండదు'లే..
మౌనపువిరి తోటన ఒక..తరువైతే పరమార్థం..!
మెఱుపులెన్నొ మోస్తున్నది..మేఘబాల చెలిమిమీర..
తను కురిసే చినుకుధార..మధువైతే పరమార్థం..!
అంతరంగ జగములేలు..శ్వాసమాటు నిధి ఏదో..
నిశ్చలముగ అందుకునే..చదువైతే పరమార్థం..!
