STORYMIRROR

sesi saradi

Abstract Drama Tragedy

4  

sesi saradi

Abstract Drama Tragedy

శాపగ్రస్త

శాపగ్రస్త

1 min
397


విధి వంచితను కాను 

శాపగ్రస్తను నేను .

దివి నుంచి భువికి 

జారి పడిన

 గాంధర్వ కన్యను నేను

 

రూపసిననే అహంభావముతో

 ఏ కురూపిని అవహేళన చేసినానో 

ఆమె అవమానాగ్నిలో

 దహించబడి సార్వరము లోనికి 

త్రోయ బడ్డాను నేను 


విధి వంచితను కాను 

శాపగ్రస్తను నేను .


దైవత్వము ఆపాదించిన 

అతిశయముతో ఏ మునికి

 తపోభంగము గావించి నానో

 ఆ మహర్షి క్రోధాగ్ని కి సమిధనై

శ లభానయ్యాను నేను .


విద్యుత్ లత వలె మెరిసి 

ఆ మెరువు ఉష్ణంతో 

ఏ వనాన్ని దహియించి నానో l

అందులోని వన్య జీవుల

 ప్రాణ భయాగ్నిలో దగ్ధమై

 బూడిదనయ్యాను నేను.


విహాంగినై ఫై కెగరే శక్తితో

 ఏ వికలంగిని అవమానించినానో

 ఆ అభిమానవతి కోపాగ్నికి

 కారణమై పంజరంలో

 బంధించబడ్డాను నేను 


తల రాతలను మార్చే వరముతో

 ఏ ప్రేమ జంటను విడదీసినానో

 ఆ జంట విరహాగ్ని

 శాపమై చుట్టుముట్టి 

దయితునకు దూరమైనాను నేను


శ్రీరాముని పాద ధూళితో

 రూపము పొందిన

 అహల్యలా

 శ్రీకృష్ణుని కర స్పర్శతో

 సుందరాకృతి పొందిన

 కుబ్జ లా,


 శాపవిమోచనానికై

 శ్రీరామ కృష్ణుల కోసం

 ఎదురు చూస్తున్నాను నేను. 



Rate this content
Log in

Similar telugu poem from Abstract