STORYMIRROR

sesi saradi

Abstract Drama Others

4  

sesi saradi

Abstract Drama Others

పుస్తక ప్రపంచం !

పుస్తక ప్రపంచం !

1 min
206

చుట్టూ మనుషులున్నా 

ఈ ఒంటరితనమేంటో ?


రణగొణ ధ్వనుల మధ్య ఉన్నా

 మనసంతా ఈ నిశ్శబ్దమేంటో ?


చుట్టూ ప్రశాంతంగా ఉన్నా 

గుండెలో ఈ అలజడి ఏంటో ?


అప్పుడే ఒక కొత్త ప్రపంచం లోకి !

 అడుగు పెట్టాను .

అదే పుస్తక ప్రపంచం !

అంతే నా జీవితం

 పూర్తిగా మారిపోయింది .


ఒంటరితనం లేకుండా 

చుట్టూ ఎన్నో పాత్రలు

 ఎన్నో పుస్తకాలూ 

ఎంతో విజ్ఞానం .


ఇప్పుడు రణగొణ ధ్వనులు కూడా

 శ్రావ్యమైన సంగీతంలా

 వినిపిస్తున్నాయి .


ఇప్పుడు మనసంతా 

ప్రశాంతత సంతరించుకుంది .



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Abstract