నీవే
నీవే
మనసు మౌనమయ్యిందా..మహాశక్తి నీవే..!
కరుణ వెల్లువయ్యావా..దివ్యశక్తి నీవే..!
తేనెలేల పలుకుతేనె..పంచుటయే పనిలే..
సత్యవచన ధారవైన..నవ్యశక్తి నీవే..!
కనులుతెరిచి వెతుకులాడు..ముచ్చటతో గొడవే..
కలలపడవ తగులబడితె..అమృతశక్తి నీవే..!
నియమనిష్ఠ లేమిలేవు..విధించే వారుండరు..
నిజసమాధి చేరావో..ధ్యానశక్తి నీవే..!
బోధలన్ని బాధించే..ముళ్ళని భావించకు..
నేర్చుకోగా సిద్ధమైన..నిత్యశక్తి నీవే..!
