నవజీవనవేదం
నవజీవనవేదం
గుండె గుడిని మ్రోగుతున్న కోటి గంటలున్నవిలే..!
విరబూసే నవ్వులలో హాయి గంటలున్నవిలే..!
పూజ సేయు చిత్తానికి భక్తిసుమము పేరేమీ..!?
సిందూరపు శోభలలో పసిడి గంటలున్నవిలే..!
మేల్బంగరు మల్లియలకు నీ మనసే పుట్టినిల్లు..!
ప్రేమ కురియు చూపులలో తీపి గంటలున్నవిలే..!
వెలుగుతున్న స్నేహదీప సరాగమే సంపద కద..!
శ్వాస సాక్షి మెరుపులలో మనికి గంటలున్నవిలే..!
కలహంసల మౌనవీణ నాదసుధయె పొంగు వేళ..!
రాధ వలపు వాకిలిలో సుమతి గంటలున్నవిలే..!
