నా విభునకు
నా విభునకు
అక్షరాల నైవేద్యము..మౌనముగా నావిభునకు..!
తెలుగుగజల్ వెన్నెలయే..హారముగా నావిభునకు..!
ఏకపత్ని వ్రతుడుతాను..ఒకేఒక్క బాణధరుడు..
నిఖిలలోక నామభజన..నిత్యముగా నా విభునకు..!
ఈశ్వరప్రియ సేవితుడే..శ్రీదశరథ ప్రియసుతుడే..
త్యాగరాజ సంకీర్తన..భోగముగా నావిభునకు..!
సతిజానకి మనోరథుడు..ఆంజనేయ భక్తివశుడె..
పొగడపూల పరిమళమే..పద్యముగా నావిభునకు..!
లంకాధిపు సంహరుడే..నరరూప నారాయణుడె..
రామదాసు నిష్టూరమె..హృద్యముగా నావిభునకు..!
జగదాధారుడు రఘుకులతిలకుడహో నా రాముడె..
వచనముగా కావ్యముగా..గీతముగా నావిభునకు..!
