STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Drama Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Drama Inspirational Others

చిన్న నవ్వులే జ్ఞాపకాలు ఎన్నో

చిన్న నవ్వులే జ్ఞాపకాలు ఎన్నో

1 min
298

తన చూపులకు సిగ్గులమొగ్గ అవుతున్న కొత్తపెళ్లికూతురుని చూస్తూ ఆ మగని కొంటె నవ్వు.....

తను అలిగిన వేళా బుజ్జగిస్తూ....తన వెనుక తిరుగుతున్న చెలికాడిని చూసిన భామమణి ముసిముసి నవ్వులు....

పడతి కడుపు పంట వార్త తన మగనికి చేరవేస్తూ కంటి కోసల నీరున్న ఇరువురి పెదవులపై చేరిన చిరునవ్వు.....

మొదటిసారి బిడ్డని చేతిలోకి తీసుకున్న తల్లి అంతవరకు పడిన వేదన మరిపించే చిన్నారి మోము చూడగానే విరిసిన చిరునవ్వు....

పెళ్లికూతురుగా ముస్తాబైన కూతురుని చూసుకొని బయటకి కనీ కనిపించని నాన్న నవ్వు...

పారాడుతూ తిరుగుతున్న పాపాయికీ అమ్మకనపడగానే విరిసే బోసినవ్వులు....

బయటనుండి నాన్న వచ్చేటప్పుడు నాన్న తెచ్చిన తాయిలాలు చూసినప్పటి అందమైన చిన్నారి కంటిమెరుపులతో కూడిన ఆనందమయమైన నవ్వులు....

కథ చెప్పవా అంటూ చేరిన మనువలను చూసి విరిసిన బోసినోటి తాత మురిపపు నవ్వులు....

ఇవన్నీ చిన్న నవ్వులే కానీ జ్ఞాపకాలు ఎన్నో...వాటిని తలుచుకోగానే మన పెదవులపై విరిసే చిన్న నవ్వుకంటే అమూల్యమైనది ఏముంది...

మీరుకుడా ఒకసారి గుర్తుతెచ్చుకోండి...ఆ జ్ఞాపకాలను...😊



Rate this content
Log in

Similar telugu poem from Drama