STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

చైత్రం లో వసంతాగమనం వచన కవితా సౌరభం కవీశ్వర్ : 14 . 03 . 2022 .

చైత్రం లో వసంతాగమనం వచన కవితా సౌరభం కవీశ్వర్ : 14 . 03 . 2022 .

1 min
276

శీర్షిక : చైత్రం లో వసంతాగమనం 

వచన కవితా సౌరభం 

కవీశ్వర్ : 14 . 03 . 2022 .

పాత పచ్చదనానికి వీడ్కోలు పలుకు శిశిరంలో రాలిన ఆకుల చే బోసిపోయి అరణ్యం .

కొంగ్రొత్త లేత నవపల్లవాలను సంతరించుకొని చైత్రంలో న

అందాల తో య్య వన మాలికా తరువుల యందు అస్థిర నివాసములతో

నివసించు అవ్వన ద్విజ సమూహాల కిలకిలారావములతో నాహ్వానించు


శుభకృత్ నూతన వర్ష ఆగమన హృదయారవిందములతో అలరించు

భావ కవితా పూల వనమువికసించేమందార మకరంద బిందు సందోహం

చిరునవ్వుల సింగారం ఒలికించే చైత్రం దిశగా అడుగులు వేస్తూగత జ్ణాపకము లా మిగిల్చే లే...

ప్రతివత్సరం పునరాగమనం చే ఈ అనుభూతులని ప్రకృతి మాత ప్రసాదించే లే

 

గల చిరు సవ్వళ్ళ చిగుళ్ళు గలగలా పారే సెలయేళ్ళకు చెట్ల కు నవచైతన్యం తెచ్చి

నూతన ఆభరణాలు సమకూర్చి నయనానందకరంగా తో కొత్త రూపం సంతరించుకొంది..

కాలచక్ర భ్రమణం చే మరల వర్ష ఋతు ఆగమనం కోసం వేచి యుండె జీవ కోటి చైతన్యం 

వేడుకగా జరుపుకునే యుగాది, రామనవమి - వసంత నవరాత్రుల పుణ్య క్షేత్రముల సందడి

 

వ్యాఖ్య : "కాల చక్రభ్రమణం లో ప్రకృతి నేర్పే జీవన సూత్రాలు రక్షించి,

           అనుసరించడమే మన విధి." 

       పాఠకులందిరికీ శుభకృత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు .



Rate this content
Log in

Similar telugu poem from Action