STORYMIRROR

murali sudha

Inspirational

4  

murali sudha

Inspirational

బ్యాక్ టు బ్యాక్

బ్యాక్ టు బ్యాక్

1 min
170

శృంఖలాల నుంచీ విశృంఖలతల వైపు

అణగారిన రూపు నుంచీ అణగార్చుకుంటున్న తీరు వైపు

నా దేశపు పయనం

నా జాతి గమనం


అరె అరె పిచ్చోడా/ వెర్రోడా

ఓ నా సోదర భారతీయుడా

ఇప్పుడు నీ రక్తం నీ కోసం నీ లోపలే ప్రవహిస్తూ ఉంది

అప్పుడు అదే నీ వాళ్ల రక్తం 

నీకోసం ఉరికొయ్యలకు వేలాడుతూ 

ఈ భారతదేశపు దారుల్లో చిక్కగా మరుగుతూ ప్రవహించింది

ఇప్పుడు నీ గుండె డబ్బు డబ్బు అంటూ అవినీతితో కొట్టేసుకుంటూ ఉంది

ఏడున్నర దశాబ్దాల క్రితపు నీ తాత ముత్తాతల గుండెలు

స్వేచ్ఛా స్వేచ్ఛా అంటూ తూరుపు కిరణాలై ఎర్రగా మండిపడ్డాయి


ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు

ఏ వాక్స్వాతంత్రం కోసం ఎన్ని గొంతులు తెగిపడ్డాయో

ఏ భావి తరపు బాగుకోసం ఎన్ని చేతులు స్వచ్ఛందంగా కత్తుల పదునుకు బలికాబడ్డాయో


ఈనాడు నువ్వు పీలుస్తున్న అమృత గాలుల నిండా తెలిసీ విషపు కోరలకు చిక్కుకున్న ఎన్ని ఆశలు దాగున్నాయో

ఈనాడు నువ్వు అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు ఏ జీవితాలు తృణప్రాయంగా త్యజించిన ఆయువుల గుట్టకు కాశాయో

గమనిస్తూ ఉండు


అప్పుడు మళ్లించగలవు నీ ధ్యేయాన్ని

వ్యక్తి బాగు నుంచీ వ్యవస్థ బాగు దిశగా

అప్పుడు ఎత్తుకోగలవు కొత్త సంకల్పాన్ని

దేశపు సత్తా చాటే నిస్వార్థ సేవకుడిగా

అప్పుడు స్వీకరించగలవు సవాళ్ళని

ప్రపంచ దృష్టిని నీ దేశంపై నిలపగలిగే నీ తల్లికి సిసలు కొడుకుగా

రొమ్ము విరిచి బలం చూపి తల్లికి వందనమిచ్చే భారతీయబిడ్డగా


Rate this content
Log in

Similar telugu poem from Inspirational