STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

బతుకులెన్నొ

బతుకులెన్నొ

1 min
4


గంజిలోకి మెతుకులేక..ఒరిగిపడే బతుకులెన్నొ..! 

శవరాజకీయమాడుతు..మిడిసిపడే బతుకులెన్నొ..! 


చీమకైన హానిని తలపెట్టని మనుషులేరి అసలు.. 

మానవతా సమాధిపై..ఎగిరిపడే బతుకులెన్నొ..! 


సత్యమెంత విచిత్రమో..బోధపడీ పడనిదేను.. 

తన సాక్షిగ ఉండలేక..మండిపడే బతుకులెన్నొ..! 


ఏది ప్రేమ ఏది చెలిమి..స్వార్థచింతనా వీధిన..

కలలతీర మందలేక..కాలిపడే బతుకులెన్నొ..! 


మొలకనవ్వు మాయమైన..ముచ్చటేల మిగిలేనో..

పూతలోనొ పిందెగానొ..రాలిపడే బతుకులెన్నొ..! 



विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Romance