STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Inspirational

5.0  

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Inspirational

భలే..భలే!సృష్టి!

భలే..భలే!సృష్టి!

1 min
290


భలే..భలే..సృష్టి!


బలశాలి మహా బలశాలి అవుతూ..

బడగు జీవి బాగా బక్క చిక్కి పోతూ ఉంటే!

భూపతులు బాకసరులు అవుతూ..

బానిసలకు భుక్తి కూడా కరవవుతుంటే!


ఇది..భగవంతుని సృష్టా..

లేక!

బలిసినోళ్ళ బెట్టే భుక్తి కి ఆశపడి

నీవు వారింట నిష్టగా వేసిన.. తిష్టా?


మతిలేని మహిళనైనా..

కళ్ళు కానక కామంతో కాటేస్తుంటే!

మగడి ఎదుటే మగువను మకిలిచేసి

మానం తీస్తుంటే!


ఇది నీ సృష్టా లేక! 

మదమెక్కిన మృగాళ్ళ కండ పుష్టా?


కన్న కొడుకే కన్న తండ్రిని..

కాగితాల కోసం కడతేరుస్తుంటే!

కన్న తండ్రే కన్న కూతుర్ని..

కసితో మసి చేస్తుంటే!

భార్యే భర్తను బరితెగించి..

బలి తీసుకుంటుంటే!

నీ.. సృష్టా లేక!

విలువలులేని విద్యా వ్యాపారుల ట్విస్టా?


ఉగ్రవాదులు తమ ఉనికి కోసం...

ఊళ్లకు ఊళ్లు ఊది పారేస్తుంటే!

నీ సృష్టా! లేక!

ఊరూరా ఊరేగుతూ..

అలిసి నీవు తీసుకున్న రెష్టా?


మున్సిపాలిటీ మొద్దు నిద్రపోతూ..

మురుగు కాల్వలకు ముద్దుల పాపను

పణంగా పెడుతుంటే!

పరమాత్ముని సృష్టా! లేక!

పని దొంగల నిర్లక్ష్యానికి.. పరాకాష్టా?


ఓ పక్క పట్టెడన్నం కోసం..

పొట్ట చేత పట్టుకొని

అరుగరుగు కాళ్లరిగేలా...

పరుగులు తీస్తుంటే!


బడాబాబుల కేమో!

బుక్కింది బయటకు రాక

వాళ్ళింట్ల పాయకానాలకే..

పాతిక లకారాలు బెడుతుంటే!

ఒరీడబ్బా! అది డబ్బా !

లేక నల్ల కుబేరులు కు పట్టిన జబ్బా?


ఓరీ..భగవంతుడా!

ఇదే..సృష్టి అయితే..

ఎవడయ్య..నీకు ఆ పేరు ఇచ్చాడు

భగవంతుడని!


బలవంతులుని..బాహు బలులుగా

బలహీనులును.. కడు హీనులుగా

చెయ్యటమే..నీ అందమైన సృష్టా!

లేక!

నీవాడుకునే ఆటలో..

పావులుగా ఉండుటకు 

మాకు వేసిన... ముష్టా?


     ......రాజ్.....




 


Rate this content
Log in

Similar telugu poem from Tragedy