Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thorlapati Raju(రాజ్)

Drama Romance Classics

4.7  

Thorlapati Raju(రాజ్)

Drama Romance Classics

BEAUTIFUL.. డ్రామా (ప్రేమ)

BEAUTIFUL.. డ్రామా (ప్రేమ)

1 min
1.3K


ప్రేమ ఒక అందమైన డ్రామా!


ప్రేమ..ప్రేమ..

కనులందు కొలువు దీరిన కోమలి కోసం

కలలు.. కలవరింతలే..ప్రేమ

గుండెలో గూడు కట్టుకున్న గులాబి కోసం

గుబులు గుబులు గా గడపటమే..ప్రేమ

మనసులో ముద్ర వేసుకున్న.. ముదిమ కోసం

మాటల్లో చేప్పలేకపోవడం..ప్రేమ

తనువున తాపం రేపి

సెగలు పుట్టించి స్వేదం రప్పించేదే..ప్రేమ

తనవులోని..

ప్రతి అణువులోనూ అలజడి రేపి

అలికిడి కలిగించి..

తడబడి తగలబడి పోయేలా చేసేదే..ప్రేమ 


ప్రేమ..ప్రేమ..నువ్వు

ఆ దేవుడు కూడా

అడలేని..అందమైన డ్రామా😀


కుండపోత వర్షం లో కూడా..

తనువును కుంపటిలా ..

కాల్చేదే...ప్రేమ!❤️

గడ్డ కట్టే చలిలోనైన..

గుండెకు సెగ పుట్టించేదే..ప్రేమ!❤️

మండుటెండలో నైనా..

మనసుకు వణుకు..

తెప్పించేదే...ప్రేమ!❤️


ప్రేమకు ఆరంభం..ఆకర్షణ!

అప్పటినుండి మొదలవుతుంది...

యెన్నో వింతల..ప్రదర్శన!

నాతిని మెప్పించేందుకు..

నానా పాట్లు పడాల్సి వచ్చిన

నేర్పుతో..ఓర్పుతో..

తన మనసు న

నిండిపోయి ఉండిపోయే లా..

నే..ప్రేమించిన!


నా..గుండె గులాబీ కోసం..నేను!

తను మిర్చి అయితే..

నే పెరుగన్నం అయిన!

తను విత్తనం అయితే..

నే సారవంతమైన నేలనైన

తను ప్రతిభ అయితే..

అది పది మందికి పంచే న్యూస్ పేపర్ నేనైనా

తను చదువుకొనేప్పుడు..

నే..అక్షరం అయిన

ఎందుకో తెలుసునా?

పుస్తకం అయితే..అది పూర్తయ్యే వరకే

నే..గుర్తుంటానేమో అని!


నింగిలోని చుక్క తానైతే..

తనకోసం నే.. చీకటినవుతా

కోయిల తానైతే..

నే వసంతకాలమై ఉండిపోత!


తన ప్రేమకోసం..

ఎన్నైనా..ఏదైనా..

ఎందుకో...ఇంక ఇంక..తక్కువే అనిపిస్తుంది!

మరొకరి కోసం ఏదైనా చెయ్యాలి..

అనేంత గొప్పది కదా..ఈ ప్రేమ!

మరి..

ప్రేమ సాఫల్యమైనప్పటి నుండి..


తను..

నాదే ఆన్న స్వార్థం..

వేరే వాళ్ళతో..

ఆత్మీయంగా ఉంటే అసూయ!

నా మాటే..

వినాలన్న అహం!

దేనికో..

తెలియని అనుమానం!

నా..సొంతమే కదా అన్న నిర్లక్ష్యం!

ఇలా.. 

దుర్గుణాల దుర్గంలా మారిపోతుంది..ప్రేమ!


ఎందుకా అని తరచి చూడగా..

అర్థమైంది ఏమిటంటే

మన ఆలోచన ధోరణి లోనే తేడా ఉంది

అది గ్రహించలేక..

మనం చేసేదే ప్రేమ అనే..భ్రమలో ఉన్నాం!


ఒక వ్యక్తిపై ఇష్టముంది అంటే..

అది..ఆ వ్యక్తికి ఇంకా స్వేచ్చనివ్వాలి

కానీ! తన ఇష్టాలను దూరం చేయకూడదు!

అందుకే..

ప్రేమ ఒక అందం..

అందరికీ చూపించు!

ప్రేమ ఒక అమృతం..

అందరికీ.. పంచు!

ప్రేమ ఒక తత్వం..

అందరికీ..బోధించు!

ప్రేమ ఒక ఊరట...

అందర్నీ ఆదరించు!


       .......రాజ్....


Rate this content
Log in

Similar telugu poem from Drama