బాల్యం
బాల్యం
శీర్షిక : మధుర స్మృతి
బాల్యం ఎంతో అమూల్యమైనది
బంగారు భవితకు నాందీయది
అమ్మ ఒడిలో గడిపే బాల్యం
అష్టసిద్ధుల కంటే మిన్నయదీ
బోసినవ్వుల కిలకిల బాల్యం
భలే పసందుగా ఉండునదీ
బుడిబుడి నడకల చిరుప్రాయపు బాల్యం
స్వేచ్ఛా పథమున సాగునదీ
చిలకపలుకులు ఒలికే బాల్యం
ముద్దూ మురిపెం గొలుపునదీ
చీకూ చింతా ఎరుగని బాల్యం
ఉల్లాసంగా గడుచునదీ
కల్లా కపటం తెలియని బాల్యం
నిరాటంకముగా గడుచునదీ
ఆట పాటలతో గడిపే బాల్యం
మానవ జన్మకే వరము అదీ
ఎన్నో విద్యలు నేర్వగ బాల్యం
ఆతృతగా సాగునదీ
నవసమాజ పెను మార్పుల బాల్యం
కృతిమంగా గడిచిపోవుచున్నదీ!