STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Fantasy Children

4  

VENKATALAKSHMI N

Tragedy Fantasy Children

బాల్యం బందీ

బాల్యం బందీ

1 min
368

శీర్షిక:బాల్యం బందీ

******************"

ఆటపాటల బాల్యం

అల్లరి చేష్టల బాల్యం

అవధుల్లేని హద్దులెరుగని 

ఆనందాల ఆ బాల్యం నేడు

పట్టణ రక్కసి కోరల్లో చిక్కింది

కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలుగుతుంది

తరగతి నాలుగు గోడల మధ్య మగ్గుతోంది

కొత్త కల్చర్ లో ఊపిరాడక మూలుగుతోంది

పెద్దల ఆశల కొక్కాలకు వేలాడుతోంది

స్మార్ట్ ఫోన్ లకు బంధీ కాబడింది

గేమ్ షోలకు అతుక్కుపోతుంది

పుస్తకాల పురుగులై ర్యాంకుల పరుగుల్లో

గజిబిజి గందరగోళంగా మారి

బోన్సాయ్ మొక్కల్లా పిన్న వయసులోనే

పదింతల జ్ఞానార్జనతో 

నేటి బాల్యం కనుమరుగవుతుంది

మళ్ళీ కల్మషమెరుగని బాల్యం

తిరిగి రావాలి

మర్మమెరుగని పసితనం చవి చూడాలి

లోకమంతా పచ్చని ఆలోచనలతో సహజమైన నవ్వులతో నిండిపోదా మరి!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy