STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బాల్యమే

బాల్యమే

1 min
295

అసలుప్రేమకు అద్దమేదో..పట్టవలెనా బాల్యమే..!

చెలిమినిధిగా ఉన్నదేదో..పలుకవలెనా బాల్యమే..!


వానకైనా ఎండకైనా..చిందులాడగ ముచ్చటే.. 

భయంలేశం లేనితరుణం..తెలుపవలెనా బాల్యమే..! 


పరుగుతీసే వాగులాగా..గలంగలగల సందడే..

అబద్దాలకు చోటులేనిది..చాటవలెనా బాల్యమే..!


మనసుగొడవే ఇంతతెలియని..దివ్యలోకం తెలిసెనా..

కన్నులెదుటి స్వర్గమేదో..చెప్పవలెనా బాల్యమే..!


కాల్వగట్టో చెఱువుకట్టో..సంబరాలకు చోటులే..

ఆటపాటల కోట ఏదో..చూపవలెనా బాల్యమే..!


ముద్దులొలికే చిట్టిచేతుల..స్పర్శ ఎంతటి భాగ్యమో.. 

అంతుతెలియని రాగవీణియ..మీటవలెనా బాల్యమే..! 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational