అవులింత
అవులింత
విశ్రాంతికి సూచనగా..విరియునులే ఆవులింత..!
నిద్ర ముంచుకొస్తుంటే..వచ్చునులే ఆవులింత..!
అయిష్టతను ప్రకటించే..ఉపాధిగా పనికివచ్చు..
వినేబుద్ధి లేనప్పుడు..కలుగునులే ఆవులింత..!
మరిలోపలి వికారాలు..కడిగేసే శక్తి కూడ..
బోధ బుర్రకెక్కుతుంటె..పొంగునులే ఆవులింత..!
రోగాలను పారద్రోలు..ఆయుధమే గమనిస్తే..
అపానమును తోసేయగ..సాగునులే ఆవులింత..!
శ్వాసమాటు శక్తి తెలుపు..ధ్యాససరిగ కుదిరినంత..
సుజ్ఞానము విందుచేయ..నిలచునులే ఆవులింత..!
ఆవులింతకన్న అన్న..ఇంకెవ్వరు లేరు నీకు..
బద్ధకాన్ని పారద్రోల..చూచునులే ఆవులింత..!
