STORYMIRROR

T. s.

Tragedy Classics

4  

T. s.

Tragedy Classics

అసమర్థుని జీవితం

అసమర్థుని జీవితం

1 min
387

నాలో నేనే నాతో నేనే..

ఎవరికీ చెప్పుకోలేని బాధ నాలోనే సమాధి చేస్తున్నా...

ఈ బాధ ఎవరికీ పంచలేక...

అందరికి దూరంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి పారిపోవాలనిపిస్తుంది...

కానీ...

వెళ్ళలేని అశక్తురాలిని...రెక్కలు విరిగిన భావాన్ని...

అందరూ ఉన్నా...

ఎవరూ లేని అనాధలా అనిపిస్తుంది...

ఏం తోచని అయోమయంలో...

ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేని ఏమి లేనిదాన్ని...

ఏ సంతోషం లేదు...

ఏ ఆనందాల హరివిల్లులు లేవు...

అలా అని... ఏ సంతోషం కోసం వెతకాలని లేదు...

తప్పుల తడకలతో తడబడిన అసమర్థ జీవితం...

సంతోషం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పారిపో అని బుద్ధి చెపుతుంటే...

మనసు ఇంకా బందీకాన బంధాల బలహీనతలో

కొట్టుకుపోతుంది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy