అరుగు
అరుగు
అరుగు
వీధి చివర ఉన్న ఆఖరి ఇల్లు అరుగు మీద ఎన్నో
ముచ్చట్లు ముదావహంగా ముచ్చట్లాడబడతాయి
వర్ణ వర్గ వయో లింగ భేదాలకతీతంగా
ఆప్యాయతలు కురిపించబడతాయి
వంటల్లో కొత్త రుచులెన్నో ఆస్వాదించ బడతాయి
మధుర జ్ఞాపకాలెన్నో నేమరేసుకోబడతాయి
విడిపోయిన జీవితాలను కలపడానికి ఆరాటపడతాయి
ఆరోగ్య సూత్రాలు చిట్కాలు పంచుకోబడతాయి
అన్యాయాన్ని అధర్మాన్ని
ఎండగడతాయి
బావి జీవితాలకు మార్గదర్శకాలు ఆవిష్కరించబడతాయి
దిక్కుతోచని వారికి దిశా నిర్దేశాలు చేయబడతాయి
నూరు అబద్దాలాడైనా పెళ్లి చేయాలనే మాటకు ఊపిర్లు ఊదబడతాయి
చందమామ కధలు ఎన్నో పురుడుపోసుకుంటాయి
అనుభవాన్ని రంగరించి ఉగ్గు పాలతో ఔపాసన పట్టబడుతుంది
సంసారాలన్ని చక్క దిద్దే వేదికలుగా తీర్చిదిద్దబడతాయి
కల్లా కపటం లేని కబుర్లన్నీ ఆహ్లాదంగా కలబోసుకోబడతాయి
ఎ చదువూ లేకుండానే జీవిత పాఠాలన్నీ నేర్పబడతాయి
తలనెరిసిన తలలన్నీ ఎప్పుడేప్పుడక్కడకు చేరుకుందామని తహతహలాడతాయి
ప్రేమానురాగాలు కుప్ప బోసి అందరికీ పంచబడతాయి
చెల్లాచెదరైన మమతాను బంధాలన్నీ అందంగా అల్లబడతాయి
ఎ డిగ్రీ చెప్పనని అనుభవాల పరిశోధన లెన్నో చేయబడతాయి
సుతిమెత్తని సున్నిత బందాలెన్నింటి కో వారధి వేయబడుతుంది
అడ్డుగోడలెన్నో చేదించి వంతెనలెన్నో నిర్మించబడతాయి
భావితరాలకు బంధాలన్నీఆత్మీయతలు తెలిపే ఆసరవుతుంది
సమస్యలన్నీ చర్చించబడతాయి
పరిష్కారాలన్నీ సూచించబడతాయి
నవరసాలను పండించి గరళం మింగిన గౌరీశునిలా
అమృతం పంచె మోహినిలా గంభీరంగా ఉండిపోతుంది
*************