"అంతర్యుద్ధం"
"అంతర్యుద్ధం"
రండి..! రండి..! రండీ...!!
దీనులరా కదిలి రండి!
జనులారా దీవించండి!!
మూర్ఖులారా తరలిపోండి!
అసమర్ధులారా తెగిపోండి!!
అక్షరాలన్నీ ఎక్కుపెట్టిన బాణలుగా,
పదాలన్నీ సమకాలీన సైనికులుగా,
వాక్యాలన్ని వరుసకట్టిన వారధులుగా,
రచనలన్నీ సమకూర్చిన సారధులుగా
నిరాశ, నిస్పృహలనే కనిపించని శత్రువులపై
నాకు నేను గా నా కవితా సామ్రాజ్యపూ విస్తరణకై
చేస్తున్న ఈ "స్వీయ ప్రేరణ"పు యుద్ధంలో
పెళ పెళ పెళమని ఆకాశమంత ఆవేదన విరిగిపడుతున్నట్టుంది
భళ భళ భళమని భూలోకమంత బరువు బద్దలవుతున్నట్టుంది
ఎగిరెగిరి పడే అగ్నిలాంటి కోపం చల్లారుతున్నట్టుంది.
ఎగిసేగసి పడే కెరటంలాంటి తాపం శాంతించినట్టుంది.
హోరుగా వీచే గాలిలాంటి శ్వాస అదుపులోకిచ్చినట్టుంది.
మృత్యువు..
నా దేహాన్ని ధహించగలదేమో?,
నా ఆత్మని హరించగలదేమో?
నా మనసుని మూగపరచగలదా??
నా ఆలోచనలను అడ్డుకోగలదా??
ఏది మృత్యువు...??
గెలుపుటంచున ప్రయత్నమాపుట మృత్యువు!
ఒక్క గెలుపుతో సరిపెట్టి, విశ్రమించుట మృత్యువు!
విమర్శకుల విమర్శలు..., అవివేకుల ఆక్షేపణలు...
పిడుగులై పడుతుంటే!, ఉరుములై ఉరుముతుంటే!
ఈ తాటాకు చప్పుళ్ళు నన్ను భయ పెట్టగలవా??
హా..! హా..!! హ్హ!!!, నా పతనాన్ని శాసించగలవా??
అడుకొకటి ముందుకేస్తూ..,
సాగించనా గమ్యానికి నా పయనం??
చుట్టనా నవయుగ శకానికి శ్రీకారం??
సత్య పవన్✍️
#ADeepThinker
