Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Abstract

4.5  

Kadambari Srinivasarao

Abstract

అంతరంగాన్ని ప్రశ్నించా!

అంతరంగాన్ని ప్రశ్నించా!

1 min
305


కనుల కొలనులో నల్ల హంసలు

సంభ్రమాశ్చర్యాలతో

నాట్యం చేస్తున్నాయి

కులుకు రాగాలు తీస్తూ..


హృదయ గవాక్షం 

తలుపులు తెరుచుకుని

ఉత్సాహం పరిగెడుతోంది

మైళ్ళ వేగంతో ఉరకలు వేస్తూ..


మనో సంద్రంలో సంతోష అలలు

ఉవ్వెత్తున లేస్తూ

నాటికల్ మైళ్ళు పొంగుకొస్తున్నాయి

చురుకుగా తీరం తాకాలని..


దేహ సామ్రాజ్యాన్ని

ఉత్సవ పల్లకీలో ఊరేగిస్తూ

భుజాలు తడుముకుంటున్నాయి

విజయ గర్వాన్ని మోస్తూ...


అంతరాత్మ లోతుల్లోకి వెళ్లి

ఆతృతగా స్పర్శిస్తూ

అంతరంగాన్ని ప్రశ్నించా

ఇదేనా ఆనందమంటే అని!?..



Rate this content
Log in

Similar telugu poem from Abstract