అన్నదమ్ములు - దాగుడుమూతలు
అన్నదమ్ములు - దాగుడుమూతలు
కరెంట్ పోయినప్పుడు నేలా బండా
కరెంట్ ఉన్నప్పుడు క్యారమ్స్
తినేటప్పుడు ఒకరికి వడియాలు
మరొకరికి మరమరాలు
స్కూలుకు వెళ్ళమంటే
ఒకరు పలకను దాచేసి
మరొకరు బలపాలు తినేసి
నానా విధములుగా తిప్పలు పెడతారు
ఇంటికి వచ్చేటప్పుడు
దారిలో గడ్డిపైన పొర్లుతూ
తరువాత దురద అంటాడు ఒకడు
మట్టిలో ఆడి బట్టలు మాపుకుంటాడు ఒకడు
ఇద్దరి కోసం కొత్త బట్టలు కొంటే
వాటిని పంచేటప్పుడు పేచీలు
ఒకరికి కొని తెస్తే
ఇద్దరి అలకలు
దీపావళి టపాసులు
కొత్త బొమ్మలు
అన్నిటికీ పంపకాల తగాదాలు
అన్నదమ్ములు
ఇప్పటికీ ఆడుతూనే ఉన్నారు
భావాలతో దాగుడుమూతలు
అర్థం కాని వారికి
రోజూ కొత్త ప్రశ్నలు
