అందాల ఆనందం
అందాల ఆనందం
అందాల ఆనందం ఈడేరెనే
వసంతుడే నీకు ప్రియుడాయెనే
యవ్వనము నీకు మెరుపాయెనే
సొగసులు నీకు బరువాయెనే
పూవుల తీగలు నిన్ను పలకరించెనే
నీ మేని వాసనలు అరువడిగెనే
శ్రావణ మేఘాలు నిన్ను పిలిచెనే
నీ కన్నుల శోభను బతిమాలెనే
చుక్కలు నీ ముంగిలిలో చేరాయి
వెన్నెలలు పక్కలు పరిచాయి
సంపెంగలు కెంపులై నిన్ను అలంకరించాయి
సరాగాలు నీ జూకాల్లో చేరాయి
ప్రియుడే మన్మథుడై నీ తలుపు తట్టగా
ఆతని కౌగిలి చేరి సుఖించగా ఇంక జాగేల
ఈ వెన్నెల రాత్రి వృథా కానేల
అందాల ఆనందం అందుకోవేల

