STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics Inspirational

4  

Dinakar Reddy

Abstract Classics Inspirational

అమ్మా వరలక్ష్మీ

అమ్మా వరలక్ష్మీ

1 min
289

సహస్ర కమలం మీద ప్రభవించిన చంద్ర సహోదరీ

శ్రీహరి హృదయాంతరంగగా వెలుగొందు కృపా సాగరీ

హే మాతా!

సమస్త జగమునకు శుభములు ఒసగు వరలక్ష్మీ

శ్రావణ వైభవమున 

క్షీరసాగర మథనములో నీ ఆవిర్భావం తలచి 

మనసారా నిన్ను మ్రొక్కాము


తల్లీ!

చారుమతి ఆచరించిన వ్రతము లోక ప్రసిద్ధమై

శ్రావణ పూర్వార్థ శుక్రవారమున

నీ వ్రతము చేసి నమ్మి నిను కొలిచాము

కంటికి రెప్ప వలె మమ్ముల కాచుకోమ్మా 

వైకుంఠ వాసినీ దేవీ శ్రీ మహాలక్ష్మీ 

మమ్మేలుకోవమ్మా!


Rate this content
Log in

Similar telugu poem from Abstract