అమ్మా నీ పసి వాణ్ణి
అమ్మా నీ పసి వాణ్ణి
గోరు ముద్దల కాలం గురుతు లేదమ్మా
జోకొట్టు పాటలు తెలియదమ్మా
నాకోసం ఎన్ని పాట్లు పడ్డావో
నా జీవితం కోసం నీ ఊపిరి ఎన్ని సార్లు పణం పెట్టావో
నువ్వు ఉన్నంత కాలం నే దూరం ఉన్నా
నే దగ్గరకి వచ్చేటప్పటికి నువ్వు శాశ్వతంగా దూరం అయ్యావు
నీ పసి వాణ్ణి నేను
నన్ను వదిలేసి వెళ్ళావు
రాతి శిలల్లోని దేవుళ్ళని ఏమని అడిగేది
మాకూ అమ్మ లేదని అంటే ఏమని బదులిచ్చేది