STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

4  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

అమెరికా-అంబెడ్కర్

అమెరికా-అంబెడ్కర్

1 min
303


ఈ దేశంలో అస్పృశ్యడు

విసిరివేయబడ్డ అంత్యజుడు

చూపులకు, మాటలకు అనర్హుడు

అందరితో కలిసి తినడం, తిరగడం,

మాట్లాడటం అమెరికాలో

అద్భుతమైన అనుభవం 


స్వదేశంలో కుళ్ళిన సమాజపు

పునాదులు పెల్లగించి

బానిసత్వం తొలగించంమంటూ

అంబెడ్కర్ ఆశయానికి ఊపిరి పోసి 

స్వేచ్ఛ గీతాలను నేర్పిన నేల! అమెరికా!


తనకున్న సమయము, దారిద్ర్యం

తనని విశ్రాంతి తీసుకొనియవ్వవని

దుస్తులకు ఆహారానికి 

రాకపోకలకు ఖర్చులు తగ్గించి

అప్పడాలో, అరకప్పు 'టీ'తో

ఆకలిని చంపివేసి

జ్ఞాన ఆకలిని పెంచుకొని

పాత పుస్తకాల దుకాణాలను గాలించి

మంచి పుస్తకాలనెంచి అవిశ్రాంతగా చదివి 

అంటారాని వాడు రాసిన 

పుస్తకాలు వెంట వేసుకొని రాగా


ఆముల్యా సంపదగా ప్రపంచ

మేధావులు ప్రశంసించగా

స్వయం కృషి, స్వీయ ప్రతిభ

ప్రజ్ఞా విజ్ఞానం తన సొంతంగా

మహోన్నతంగా మహావృక్షమై

ఎదిగి ఏడుకోట్ల దళిత గుండెల్లో జ్యోతివైనావు


శతాబ్దల ముగవేదన, దీనులైన దళిత జాతి

మానవతా హక్కులకోసం, జాతి ఔన్నత్యం కోసం

కనీసపు గుర్తింపు కోసం నీవు పడిన వేదన 

సంక్షోభము, నీ త్యాగం, నీ ధైర్యం, నీ సహనం

ఈ నవ యువతరం, నూరవవంతు శ్రద్ధచూపిన 

ఈ జాతి భవిష్యత్తు నిస్సందేహంగా దేదీప్యమానం.....



Rate this content
Log in

Similar telugu poem from Abstract