అగ్ని గుండమీ సమాజం
అగ్ని గుండమీ సమాజం
చుట్టు అగ్ని జ్వాలలు రగలుతుంటే కూల్, కూల్ అంటావేంట్రా.
వెళ్ళి ఆర్పు.
అదొక్కటే మార్గం, లేకపోతే మాడి, కాలి చస్తావ్.
ఎవడో, ఏదో చేస్తాడులె నాకెందుకులే అని నువనుకున్నట్లే అందరూ అనుకుంటుంన్నారు,
కాబట్టే పాములులా మన చుట్టూ వ్యాపిస్తున్న ఈ జ్వాలలు.
ఆఖరికి మనకి హాహాకారాలు కూడ పట్టడం లేదంటే మన మానసిక స్థితి ఎంత ఉన్నతంగా పడిపోయి ఉందో తెలసినా తెలియనట్టు ఉంటుంన్నాం.
ఇంతకీ మనకేం కావాలిరా, మనిషిగా బ్రతకడమే కద, మరి లే, కదులు.
