"అడవిగాచిన వెన్నెల"
"అడవిగాచిన వెన్నెల"
నీటిలో ఈదే చేప కన్నీరు, బయటకి కనిపించునా..!
అంత మాత్రాన దానికి బాధేంటో తెలియదంటే ఎలా??
గాలిలో ఎగిరే పక్షి రెక్కలు, ఆకాశాన్ని తాకునా..!
అది దాని ప్రయత్నంలో లోపమంటే ఎలా??
పొద్దస్తమాను కనపడే నింగి, రాతిరికి నిలుచునా ..!
చీకటికి భయపడి అది దాక్కుందంటే ఎలా??
ఊహల లోకంలో విహరిస్తున్న నిరాశావాదిననో!
ఇష్టాలకి నోచుకోలేని ఆశావాదిననో!
నష్టాలకు నలిగిన నేర్పరిననో!
కష్టాలకు కట్టుబడిన బానిసననో!
ఒంట్లోనున్న సత్తువంతా కూడగట్టి అహర్నిశలూ శ్రమిస్తూ, ఒడిదుడుకులన్నీ అధిగమించినా గమ్యం ముంగిట చతికిల పడుతున్నా...
బహుశా అదృష్టమనే ఆ చివరి మెట్టు నాకెప్పటికీ అందని ద్రాక్ష కాబోలు, అందుకే నన్ను బోల్తా కొట్టించి వెక్కిరిస్తోంది.
అయినా ఎందుకో పోటీపడి మరీ పోరాడాలనిపిస్తుంది.
సక్సెస్ నీ సాధించడానికి కాదు సుమా!!
ప్రయత్నాన్ని సాగించడానికి మాత్రమే.
అందుబాటులో అన్నీ ఉన్నా...
అనుభవించడానికి సాధ్యపడదేది..!!
అందుకే, నా జీవితమొక అడవిగాచినా వెన్నెల!
-సత్య పవన్ ✍️
