STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ఆత్మ విశ్వాసంతో..

ఆత్మ విశ్వాసంతో..

1 min
2

ఆత్మవిశ్వాసంతో..
(వచన కవిత)
**************************
కట్టు బానిస తనంతో మనసు కలవరపడుతుంటే.
చుట్టు ప్రక్కలవారు నిరంతరమవహేళన చేస్తుంటే.

మన మాన ప్రాణాలకు తగని ముప్పు వాటిల్లుతుంటే.
కనీవినీ ఎరుగని కరవు మన జీవితాల్ని కబళిస్తుంటే.

మనోనిబ్బరం కోల్పోయి ప్రతి క్షణం నరకాన్ని చూస్తుంటే.
అనుకోని యనర్థమేదో తెలియని యాపదలో నెట్టేస్తుంటే.

  తడబడుతుంటే మన జీవన పయనమెలా సాగుతుంది?
కడకు గమ్యమేదో తెలియక నిర్వేదమలముకుంటుంది.

విధిచేతిలో మనమంతా పగటి వేషగాళ్ళమయిపోతే.
అధికారం ఎక్కడుంది? మన చైతన్యం నశించిపోతే.

బ్రతుకుపై నాశతో సతతము జీవించాలనుకోవోయి!
ప్రతికూల వాతావరణంలో కూడా పయనించాలోయి!

జీవితమొక వైకుంఠపాళి యనే సత్యాన్ని తెలుసుకో!
ఆ విధి నెదిరించి ఆత్మ విశ్వాసంతో నీవు మసలుకో!

నీ చేతికి చక్కని నిచ్చెన లందలేదని యాక్రోశ పడకు!
నీ చేవకు పరీక్ష యని కఠిన శ్రమతో పరిష్కారాన్ని వెదకు!
 
 నీ విశ్వాసమునే యాలంబనగా నేర్చుకోవోయి పాఠాలు!
జీవితంలో గమ్యాన్ని చేరటానికి శక్తి యుక్తులే సోపనాలు.//
**************************


Rate this content
Log in

Similar telugu poem from Inspirational