ఆశ
ఆశ
ఇంకా ముందుందేమో
" వుందిలే మంచీ కాలం
ముందూ ముందూనా"
అన్నాడో సినీ కవి నా చిన్నతనంలో
కదా!అని ఆశగా ఎదురుచూశా
ఆ ముందు కాలం వెనుకబడి పొయింది
"మరోప్రపంచం మరోప్రపంచం"
అని కదం ద్రొక్కా శ్రీశ్రీ తోపాటు
ఉడుకురక్తం కదా
ఉన్నప్రపంచమే మాసి పోయింది
మరోప్రపంచం మాటే లేదే
"అదిగో నవలోకం"అన్నాడు
మరో ఆశావాది
అదిగో అరుంధతి అని
పౌరోహితిడన్నట్లు పట్టపగలు !
నడివయసూ నడిచి పోయింది
నవలోకమగుపించలేదు
"అచ్చేదిన్ "అన్నాడో
పచ్చి అబద్ధాలకోరు
అ వచ్చే దినములెప్పుడో!
ఆకలితో చస్తున్నాయ్ అన్ని వర్గాలూ
పిండాకూడు పెట్టేసు కుంటున్నాం
ముసలాడినయ్యాను
మంచిదినాలొస్తాయని
ఆశిస్తూనే వున్నా
ఆప్టిమిస్టులం కదా
నా మునిమనుమలకన్నా వస్తాయని
నిరీక్షణ కొనసాగుతూనే ఉంది
... సిరి ✍️❤️
