STORYMIRROR

Gayatri Tokachichu

Thriller

4  

Gayatri Tokachichu

Thriller

ఆ వర్షపు రాత్రిలో

ఆ వర్షపు రాత్రిలో

1 min
7

ఆ వర్షపు రాత్రిలో...

(తేటగీతి మాలిక )


బడబటంచును జోరుగా వానకురిసె 

విద్యుతింకనూ రాలేదు వీధి యందు

కారు చీకటి గృహములో క్రమ్ముకొనెను

చిమ్మ చీకటిలో నిల్చి చింతపడితి

కిటికి చప్పుడు చేసెను కిటకిటయని

భయముతో నేను బెదురుచు వణుకు చుంటి

కన్ను పొడిచినా వస్తువుల్ కాన రావె!

దబ్బు మంచునా శబ్దము దడదడయన

కిర్రు కిర్రుమని తలుపు 'కీచు! 'మనగ 

కనులు పెద్దవి చేయుచు గాంచుచుంటి

దయ్యమేమో యటంచును తలచి తలచి

బిక్క చచ్చితి నొంటినై బెంగతోడ

క్రూరమైనట్టి దయ్యముల్ కొలువు చేయు

గృహము నందుండిపోతిని కెవ్వు మనుచు

నంత విద్యుత్తు గృహములో కరుగుదెంచె

దీపకాంతిలో నచ్చట తేరిచూడ

తలుపు ప్రక్కన పిల్లితాన్ దడిసి తడిసి

మ్యావు మనుచుండి తిరుగ నా మదిని భయము

తొలగి పోవగా నా వెఱ్ఱి తెలివి తలచి 

నవ్వుకొంటినా వర్షపు నాటి దినము.//


Rate this content
Log in

Similar telugu poem from Thriller