Ramesh Babu Kommineni

Inspirational

4.8  

Ramesh Babu Kommineni

Inspirational

ఆ రోజు

ఆ రోజు

1 min
343


ప౹౹

వ్యక్తి వికాసానికి పాఠశాలే మన పునాదిగా

శక్తి యుక్తలకే పదునే పెంచే అది అనాదిగా ౹2౹


చ౹౹

బాల్యంలో ప్రతి విద్యార్థికి ఇది అనుభవం

మాలిన్యం లేని ఆరంభానికి అది ప్రాభవం ౹2౹

కొత్తగా అడుగు పెట్టిన అనుభవం బడిలో

చిత్తమంతా మునిగే వింతయోచన ఒడిలో ౹ప౹


చ౹౹

పలకా బలపంతో ప్రత్యక్షమూ ప్రతి ఒకరం

పప్పు బెల్లాల పంపకముతోనే ఉత్ప్రేరకం ౹2౹

అయ్యవారు దిద్దించారు నాచే ఓనమాలు

బియ్యంలో రాశానే లేక ఎట్టి కొలమానాలు ౹ప౹


చ౹౹

బడిలో ఉన్నా తెలియక ఎంతో సమయం

అడిగి తెలుసుకొన్న ఆసమయ నియమం ౹2౹

అది నా మొదటి రోజు బడిలో అనుభవం

చదివినా చదువులకదే తొలి స్వానుభవం ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Inspirational