ఆ రోజు
ఆ రోజు


ప౹౹
భారతీయులందరి భావాలు కలిసిన ఆ రోజు
తారతమ్యం లేక అందరూ ఆనందించే రోజు ౹2౹
చ౹౹
శాంతి సౌభాగ్యాలే కోరే ఘనమైనది ఈ దేశం
ఎంతో విలువలతో ఉన్నతి కోరేకును ప్రదేశం ౹2౹
ఇరుగుపొరుగు దేశాలతో మైత్రినికోరుకొన్నది
తరుగులేని స్నేహము అందించి పెరగమన్నది ౹ప౹
చ౹౹
పరుగున దుష్కర్ములూ పగలతో రగిలించినా
పొరుగుదేశం ప్రోత్సాహంతో తెగ సకిలించినా ౹2౹
ఏనాడును ఏ దేశాపూ దురాక్రమణకు పోనిది
ఎవడన్న కాలుదువ్వెతే అక్కడే ఖండించినది ౹ప౹
చ౹౹
జూలు విదిల్చిన మృగాన్ని వధించిన ఆరోజు
కాలుకదల్పక సర్జికల్ స్ట్రైక్స్ చేసిన అదే రోజు ౹2౹
నేను భారతీయుడైనందుకు గర్వపడిన రోజు
నేను సైతం దేశానికి వందనమర్పించిన రోజు ౹ప౹