ఆ చూపులు
ఆ చూపులు
బాలేదు అనుకుంటా
ఇంకా తొంగి తొంగి చూడడం
ఆటల్లో తొండి చేయడం
నువ్వూ నేనూ ఒకే జట్టు కదా
ఓయ్ నిన్నే
మళ్లీ కాదన్నట్టు ఆ చూపులు
అవే చూపులు
కొంత వెక్కిరిస్తూ
మరికొంత కవ్విస్తూ
ముందు డొక్కులా అనిపించాయి
పోగా పోగా పోన్లే అనిపించాయి
ఆపైన ఫరవాలేదు అనిపింఅనిపించాయిచాయి
తరువాత
ఆ తరువాత
అవి నన్ను వశం చేసుకున్నాయి
కొన్ని సార్లు కొంటెగా
మరిన్ని సార్లు క్రీగంటగా
అలా ఎన్ని సార్లు నువ్వు చూడడం నేను చూశానో
ఇంకా అలానే చూస్తావా
మ్
నువ్వు చూస్తూ ఉండు
నేను నిద్రపోతా..

