STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

ప్రకృతి

ప్రకృతి

1 min
368

ప్రభాతసమయాన నీలి ఆకాశములోని.. 

 శ్వేత వర్ణపు మబ్బులు అలా అలా విహరిస్తూ.. 

  ఆనందములో తేలియాడుతున్నాయి

  అంతలోనే భగభగ మంటూ ఉషోదయ 

   సూర్యుడు ప్రకాశించాడు 

   ఇంకేముంది భానుడి వేడికి 

   తెల్లని మబ్బులు కాస్తా నల్లగా మారి.. 

    నక్కి నక్కి దాక్కున్నాయి 

    సాయం సంధ్యా సమయమయ్యింది ..

    వేడి బుసలు నిప్పులు వెదజల్లిన ..

    భానుడు అలసి సొలసి.. 

    ఆకాశములో కనుమరుగయ్యాడు 

   విచారముగా బాధ లో ఉన్న కారుమబ్బులు 

   అన్నీ తమ బాధను వెలిబుచ్చుకోవటానికి.. 

   ఒకే చోట చేరుకున్నాయి 

  అలా అన్నీ ఒక చోట చేరి తమ మనసులోని ..

   బాధను వెలిబుచ్చగానే మేఘాల నుండి ..

   కన్నీళ్లు జలజల నేలపై చినుకులై రాలి..

   వానగా నేలపై కురిసింది 

    నేల తల్లి మురిసింది 

    పచ్చని చెట్లు వానలో తడిసి.. 

    స్నానమాడి చల్లటి గాలులతో ..

   ఊయలూగ సాగాయి 

   పక్షుల కిలకిల రావాలతో.. 

   ప్రకృతి శోభాయమానమయ్యింది 

   తేలిక పడిన మనసుతో.. 

   కారు మబ్బులు తమ శ్వేత వర్ణాన్ని..

  దరించి గగనములో ఆనందముగా.. 

  విహరించసాగాయి.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational