gowthami ch

Comedy

4.2  

gowthami ch

Comedy

రాజ్ (తాత)

రాజ్ (తాత)

2 mins
460


"కౌశల్యా , సుప్రజా, రామ , పూర్వా సంధ్యా ప్రవర్థతే" అంటూ వచ్చే సుప్రభాతం వింటూ తన పనులు మొదలు పెట్టింది సావిత్రి. ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, దేవుడికి పూజచేసి జపమాల చేతిలో పట్టుకొని కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకుంటుంది సావిత్రి వాళ్ళ అత్తగారు శకుంతలా దేవి.


"వెయ్యి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా...ప్రాణ పగముగా పెంచుకుంటిని నిన్ను మరువగ లెనులే

వెయ్యి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా...

రెడ్డీ ఇక్కడ సూడు ,ఎత్తి సలవా జోడు ,చొరవా కలిపి పిలిచే, సలికీ పచ్చల ఈడు"


పెద్దగా సౌండ్ తో వస్తున్న పాట విని కోపంగా పూజ గదిలో నుండి లేచి బయటకి వచ్చి చూసేసరికి హాల్లో ఎదురుగా ఉన్న టీవీ లో వస్తున్న పాటకి డాన్స్ వేస్తూ ఉన్న భర్తని చూసి ఆవేశంగా వెళ్లి టీవీ ఆఫ్ చేసి "ఏమయ్యో నీకేమన్నా చెవుడు వచ్చిందా ఏంటి!! అంత సౌండ్ పెట్టి ఎగురుతున్నావ్." అంటూ అరిచింది శకుంతలా దేవి.


"చెవుడు కాదే ఆ పాటలు అలానే వినాలి. నీకేం తెలుసు వీటి గురించి. నా డార్లింగ్ ని అడుగు చెప్తుంది." అంటూ సోఫాలో కూర్చున్నాడు రాజశేఖరం.


"హా... ఆయబ్బో ఈయన గారికి ఏదో పెద్ద అన్నీ తెలిసినట్లు. అయినా ఈ వయసులో అలాంటి పాటలు వినడం ఏంటయ్యా అసహ్యంగా. ఎవరైనా చూస్తే నవ్విపోతారు."


"ఓయ్.. సుక్కు...ఏం మాట్లాడుతున్నావ్.. ఇప్పుడు నాకేమంత వయసు అయిందని iam just 16 you know . "


"అవునవును వచ్చేసాడమ్మా 16 ఏళ్ళ బాలా కుమారుడు .ముందు తమరి పళ్ళ సెట్ ఎక్కడో పడిపోయినట్లుంది వెతుక్కోని వచ్చి పళ్ళు తోముకోండి" అంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది శకుంతలా దేవి.


ఇదంతా వంటింట్లో నుండి వింటున్న కోడలు వీళ్ళ పొట్లాట మాములే అనుకోని నవ్వుకుంది.


"డార్లింగ్... డార్లింగ్ ...ఎక్కడ నా డార్లింగ్" అనుకుంటూ మనవరాలి గదిలోకి వచ్చి గుడ్ మార్నింగ్ డార్లింగ్ ఏంటి ఇంకా పడుకొనే ఉన్నావ్ లే లేచి తయారవ్వు వాకింగ్ కి వెళ్దాం" అంటూ మనవరాలిని లేపుతున్నాడు రాజశేఖరం.


"గుడ్ మార్నింగ్ రాజ్" అంటూ పైకి లేచి తాతయ్య భుజం మీద వాలిపోయింది. "ఒసేయ్... అక్షరా లేచావా లేదా..."అంటూ నాయనమ్మ అరవడం విని టక్కున లేచి గబ గబా తయారయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అక్షర.


అందరూ బ్రేక్ఫాస్ట్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సావిత్రి ఒక్కొక్కరిగా అందరికి ఇడ్లీలు పెడుతుంది. "ఏమ్మా సావిత్రి బ్రెడ్ జాం లాంటివి లేవా ..రోజు ఇవే ఇడ్లీలు దోసలేనా... మారండమ్మా..."


"కరెక్టుగా చెప్పావ్ రాజ్.." అంటూ తాతయ్య కి హైఫై ఇచ్చింది అక్షర.


"రాజ్ ఏంటే రాజ్ తాతయ్య అనలేవా..?" కోపంగా అంది సావిత్రి.


"దాన్నేమి అనకు కోడలా. నేనే అలా పిలవమన్నాను. ఈ కాలంలో కూడా ఏంటి తాతయ్య , నానమ్మ అంటూ సిల్లీగా.."


అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత అక్షర ని కాలేజీలో దింపి ఉద్యోగానికి వెళ్ళింది సావిత్రి.


"ఎక్కడికెళ్లాడబ్బా ఈ ముసలోడు ఇల్లంతా వెతికాను ఎక్కడా కనపడలేదు." అనుకుంటూ బయటకి వెళ్లి చూసేసరికి జీన్స్ పాంట్ , టీషర్ట్ వేసుకుని ,మొహానికి పౌడర్ పూసుకుని ,సెంట్ కొట్టుకొని ,నెత్తిన ఉన్న నాలుగు ఎంట్రుకల్ని దువ్వెనతో దువ్వుతూ ఎదురు ఇంట్లో ఉన్న పనిమనిషిని చూస్తూ "కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే" అంటూ పాట పడుతున్న భర్తని చూసి "ఇందా ఇవి పెట్టుకో ఇంకా బాగా కనపడుతుంది" అంటూ కళ్ళజోడు అందించింది భార్య శకుంతలా దేవి.


ఆ కళ్ళజోడు తీసుకొంటూ భార్య వైపు చూసి "నువ్వా!!..నవ్వెందుకు వచ్చావ్ బయటకి, లోపలికి పో.. నీతో నన్ను ఇలా చూస్తే నాకు పెళ్లి అయింది అనుకుంటుంది..పో... పో... లోపలికి" అన్నాడు ఎదురింటి పని పిల్లని చూస్తూ.


ఇంక కోపం ఆపుకోలేక "ముందు నువ్వు లోపలికి రావయ్యా చెప్తాను నీ సంగతి , పోన్లే అని గొమ్ముగా ఉంటే రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నీ పిచ్చి పనులు" అంటూ చొక్కా కాలర్ పట్టుకొని లోపలికి లాక్కుపోయింది.


తరువాత ఏం జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను..


Rate this content
Log in

Similar telugu story from Comedy