Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

gowthami ch

Inspirational


4  

gowthami ch

Inspirational


రంగనాధం మాష్టారు

రంగనాధం మాష్టారు

6 mins 307 6 mins 307

నా పేరు రంగనాధం, కానీ చాలా కాలం క్రితమే ఆ పేరుతో పిలవడం మానేశారు చాలా మంది, నా సుపరిచితులు, నా సహచరులు, నా అనుచరులు ఇలా, నా ఈ చిన్న ప్రపంచంలో నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ పిలిచే పిలుపు రంగనాధం మాష్టారు. అది నా వృత్తి నాకిచ్చిన ఒక గుర్తింపు. అదే నా గౌరవం గా భావించాను ఇన్నాళ్లూ. 


ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఇన్నేళ్లు నాకు ఒక గుర్తింపు ఇచ్చిన పాఠశాలని వదిలి వస్తుంటే ఏదో తెలియని దిగులు. ఏదో కోల్పోతున్నాననే బాధ. ఒకటా రెండా 40 ఏళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాఠశాలతో. ఎంతో మంది విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పించాను. అక్కడి మనుషులే కాదు అక్కడి ప్రతి అణువుతో ఎన్నో జ్ఞాపకాలు. 


సరిగ్గా నా రిటైర్మెంట్ కి ఇంకో వారం గడువు ఉంది అనగా ప్రతిరోజు లాగానే ఉదయమే తయారయ్యి పాఠశాలకు వెళ్ళాను. పాఠశాలలోకి అడుగుపెడుతూనే రోజులాగే నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు వాచ్మెన్ రాము. మరో నాలుగడుగులు ముందుకు వేసి ఎదురుగా స్టేజి మీద ఉన్న వివేకానందుడి పాలరాతి విగ్రహం ముందు ఉండే వాడిపోయిన పువ్వులను తీసేసి పక్కనే ఉన్న పూల కుండీ లోని రోజాలను కోసి విగ్రహం ముందు ఉంచి ఒక్క క్షణం మౌనం వహించాను. 


చిన్నగా నడుచుకుంటూ నా గది వైపుకి అడుగులు వేసాను. అలవాటు ప్రకారం గదిలోకి అడుగుపెదుతూనే చుట్టూ పరికించి చూశాను. గదినంతా తుడిచి శుభ్రంచేసి పూజ చేసి నా టేబుల్ ని సర్ది సిద్ధంగా ఉంచాడు రాము. నేరుగా నా కుర్చీ దగ్గరకి వెళ్ళి కూర్చుండబోతుండగా "నమస్కారం మాస్టారు గారు!"అంటూ ఎవరో పిలిచినట్లు అనిపించి తల తిప్పి గుమ్మం వైపు చూసాను. 


ఎదురుగా నించున్న వ్యక్తికి సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉంటుంది. పొడుగ్గా ఉన్నాడు అతను వేసుకున్న దుస్తులని బట్టి చూస్తే అతను ఏదో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నట్లు ఉన్నాడు. నేను ఇంతకు ముందెప్పుడూ అతనిని చూసిన జ్ఞాపకం లేదు, ఎవరై ఉంటారో అని ఆలోచిస్తుండగా "హలో మాష్టారు గారు, నమస్కారం. ఎలా ఉన్నారు?" అంటూ లోపలికి వచ్చి నా కాళ్ళకు నమస్కరించాడు. "ఎవరయ్యా నువ్వు! నిన్నెప్పుడూ నేను చూడలేదే!! నేనెవరో నీకు తెలుసా!? అని" అడిగాను సందేహ నివృత్తికోసం.


"నేను మీకు గుర్తు ఉండకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు" అంటూ నన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా వచ్చి నించున్నాడు. 


"నేనెవరో నీకు తెలుసా! అదెలా?" అడిగాను అతనెవరో తెలుసుకోవాలనే ఆతృతలో. నన్నే చూస్తూ నించున్న ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ తన చేతిలోని ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టాడు. అతని నవ్వుకి అర్ధం తెలియలేదు కానీ అతనిచ్చిన ఉత్తరాన్ని బట్టిచూస్తే మాత్రం అతనితో నాకున్న పరిచయం ఇప్పటిది కాదని తెలుస్తోంది. 


ఆ ఉత్తరం తెరచి అందులో ఏముందో చూసాను. వయస్సు ప్రభావం వల్ల అక్షరాలు మసకగా కనపడుతున్నాయి, అది గమనించిన ఆ వ్యక్తి పక్కనే ఉన్న కళ్ళజోడు తీసి నా చేతికి అందించాడు. దాన్ని పెట్టుకొని చదవడం ప్రారంభించాను.


అది నా స్వహస్తాలతో రాసిన ఉత్తరం అని అర్ధమైంది. కానీ, ఎవరికి ఎప్పుడు రాశానో అర్ధంకాలేదు, అది తెలుసుకోవాలనే చదవడం ఆరంభించాను. మొదటి 2 వాక్యాలు చదవగానే ఆ తరువాత ఏమి రాసుందో చదవవలసిన అవసరం లేకుండానే పైకిలేచి.... ఎదురుగా ఉన్న వ్యక్తిని దగ్గరకు తీసుకొని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాను. అతను కూడా అంతే ఆప్యాయతతో నన్ను హత్తుకున్నాడు. కాసేపటికి నా వైపు చూసి నవ్వుతూ మరో పేపర్ తీసి నా చేతిలో పెట్టాడు. 


తెల్లటి కాగితం 4 గా మడిచి ఉంది. చేతికి తీసుకుంటూనే ఏమిటి ఇది మరలా? అన్నట్లు సందేహంగా చూసాను, "తెరచి చూడండి మాష్టారు" అన్నాడు నవ్వుతూ. తెరచి చదవడం ప్రారంభించాను. 


"ప్రియమైన రంగనాధం మాస్టారు గారికి నా పాదాభివందనం.


ఈరోజు మీ ఎదురుగా నిలబడి ఉన్నది ఎవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. ఇదంతా మీ ఆశీర్వాదం వలనే జరిగింది. మీరు విత్తనం వేసి నాటిన మొక్క ఈరోజు ఇంతలా ఎదిగి ఒక కలెక్టరు గా మీ ముందు నించుంది. ఈరోజు కోసమే నేను ఇన్నాళ్లు ఎదురుచూసింది. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న నా కొడుకుని చూసి నేనెంతగా గర్వపడుతున్నానో అంతే గర్వం ఒక గురువుగా మీరూ పొందేవుంటారని ఊహించగలను. 


మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఎప్పుడూ మీరు క్షేమంగా ఉండాలని కోరుకునే మీ పుత్రికా సమానురాలు వింధ్యా."


 చదివడం పూర్తి అయిన వెంటనే ఎదురుగా ఉన్న గిరిధర్ భుజం మీద చేయివేసి చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ "నిన్ను, ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది గిరి" అన్నాను. 


"ఇదంతా మీ మూలంగానే సాధ్యమైంది మాస్టారు, మాస్టారు అంటే పిల్లలకి పాటాలు చెప్పడం మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు మంచి మార్గం వైపు నడవాలని ఆరాటపడే మీలాంటి వాళ్లుమస్తర్ గా పొందడం మా అదృష్టం. ఆరోజు మీరు నాకు ఇచ్చిన ధైర్యం వల్లనే నేను ఈరోజ్ ఒక కలెక్టర్ గా మీ ముందు నించున్నాను. ఈరోజు నా కంటూ ఒక గుర్తింపు, సంగంలో ఒక పేరు వచ్చాయంటే అది మీ మూలంగానే.


జీవితం మీద విరక్తితో ఉన్న నాకు, చదువు యొక్క గొప్పదనాన్ని తెలిసేలా చేసారు, ఇదంతా మీ వల్లే జరిగింది. నా ఈ ఎదుగుదలకు కారణమైన మిమ్మల్నే మొదటిగా కలిసి ఈ శుభవార్త చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఈరోజే నేను ఉద్యోగంలో చేరవలసిన రోజు నన్ను ఆశీర్వదించండి" అని కాళ్ళ మీద పడ్డాడు.


 "ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది గిరి నిన్ను ఇలా చూస్తానని నాకెప్పుడో తెలుసు, చదువుని నమ్ముకున్న వాడు ఎప్పుడు ఓడిపోడు, నీలో ఆ తెలివి, పట్టుదల ఉంది కాబట్టే సాధించగలిగావు. ఇకపై నీ ఉద్యోగం లో ఇలానే పట్టుదలతో పని చేసి నిజాయితీగా నిలబడి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. " అని ఆశిర్వదించి పంపాను. 


అతని రాక నాలో ఏదో తెలియని ఉత్సాహాన్ని నింపింది. నన్ను నా గతం తాలూకు జ్ఞాపకాలలోకి నడిపింది. ఒకరోజు తరగతి గదిలోకి నేను అడుగు పెట్టేసరికి గది అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండే విద్యార్థులు మౌనంగా కూర్చొని ఉన్నారు. ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారా! అని లోపలికి వెళ్ళి కుర్చీలో కూర్చొని హాజరు వేస్తూ ఉన్నాను ఎవ్వరి మొహం లో నవ్వు లేదు అలానే ఉన్నారు అంతా. కొంతసేపటికి "గిరిధర్ గిరిధర్" అని పిలిచాను. 


"గిరిధర్ ఈరోజు స్కూల్ కి రాలేదు మాస్టారు" అంది ఒక అమ్మాయి పైకి లేస్తూ మొహం దిగులుగా పెట్టి. "ఏం! ఎందుకని!! ఏమైంది వాడికి?" అని అడిగాను. "వాడి నాన్నకి ప్రమాదం అయ్యి చనిపోయారు మాష్టారు" అన్నాడు ఇంకొకడు ఏడుపుని దిగమింగుతూ. ఆ వార్త విన్న నేను చలించిపోయాను. గిరిధర్ చాలా మంచి కుర్రాడు అలాంటి వాడికి ఇలాంటి కష్టం రావడం నిజంగా బాధగానే ఉన్నా పిల్లల మొహాలలో నవ్వులు చూడాలని కాసేపు పాఠం పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పి అందరి ఆలోచలని మరోవైపుకి మరల్చగలిగాను కానీ నాకు మాత్రం లోలోపల ఏదో బాధ. 


కొన్ని రోజుల తర్వాత గిరిధర్ స్కూల్ కి రావడం ప్రారంభించాడు, కానీ ఇదివరకటిలా ఎవరితో కలవడం లేదు, మాట్లాడటం లేదు, ఒంటరిగా ఉంటూ, దిగులుగా ఉన్నాడు. అది గమనించిన నేను ఒకరోజు గిరి వివేకానందుడి విగ్రహం ముందు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండడం గమనించి అతని దగ్గరకు వెళ్లి మెల్లిగా భుజం మీద చెయ్యి వేసాను, నా స్పర్శ తగలగానే ఉలిక్కి పడి పైకి లేచి, మాష్టారూ అంటూ నన్ను చుట్టేసాడు. ఆ క్షణంలో వాడి పట్ల ఏదో తెలియని భావన నాలో మెదిలింది. వాడి పరిస్థితి చూసి జాలి కలిగింది. మెల్లిగా మాట్లాడి ఆ నిముషానికి వాడిని బుజ్జగించగలిగాను కానీ ఆ తర్వాత కొన్నిరోజులకి గిరి పాఠశాలకు రావడం పూర్తిగా మానేశాడు. ఒకరోజు పాఠశాలలోని ఒక విద్యార్థి గిరి గురించి చెడుగా మాట్లాడం విని ఆశ్చర్యపోయాను. అసలు గిరికి ఏమైంది ఎందుకిలా మారిపోయాడో కనుక్కోవాలి అనుకోని గిరికి తెలిసిన వాళ్ళందర్ని అడిగాను.


వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత తన చుట్టాలు, బంధువులు అంతా తమతో సంబంధాలు తెంచేసుకొని వెళ్ళిపోయారని, వాళ్ళ అమ్మ చాలా దిగులు పడుతుందని ఆమె బాధని చూసి భరించలేక గిరి మనసులో వారి పట్ల అసహ్యం , ద్వేషం మొదలయ్యాయని, ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే అవ్వడంతో బయట అప్పు కోసం వెళ్తే తండ్రి లేని వాడని, అప్పు ఇవ్వమని ఇలా నానా విధాలుగా భాధపెట్టడంతో అతనిలో ఏదో తెలియని బాధ అందులో నుండి కోపం అదే కసిగా మారి రౌడీ లా మారిపోయాడు." అని వాళ్ళు చెప్పిన మాటలు విని చాలా బాధ పడ్డాను. 


వాడి పరిస్థితి ఇలానే ఉంటే ఇంకా ముందు ముందు ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఊహించి, ఒకరోజు గిరిని వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్ళాను. చూడు గిరి కష్టం లో ఉన్నప్పుడే ప్రపంచం తీరు అర్ధమవుతుంది. మనుషుల మనస్తత్వాలు స్పష్టంగా తెలుస్థాయి. సుఖం విలువ తెలుస్తుంది. అలా అని ఆవేశం లో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నీకిప్పుడు మీ నాన్న చనిపోయిన దుఃఖం కన్నా నా అనుకున్న వాళ్ళ నిజ స్వరూపాలు తెలిసి కోపంలో ఉన్నావు. ఈ సమయం లోనే నీకు అయిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఎవరో అర్ధమవుతుంది. ఇప్పుడు నీ పోరాటం మొదలుపెట్టు కానీ మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిన మనుషుల మీద కాదు వాళ్ళని అలా అనేలా చేసిన పరిస్థితుల మీద. వాటి మీద విజయం సాధించు. అది ఒక్క చదువుతోనే సాధ్యం. నీ చదువే నిన్ను కాపాడుతుంది.


భర్త లేరని ఇప్పుడు నీ తల్లిని చిన్న చూపు చూసిన వారందరికీ నా తల్లికి అండగా నేనున్నాను అని గర్వంగా చెప్పగలగాలి. భర్త చనిపోయినా , అయిన వాల్లే అనాధని చేసి వెళ్లినా , ఒంటరి ఆడదని చులకన చేసినా, అన్నింటిని భరించి సహించి బ్రతుకుతుంది అంటే అది నీ కోసం. తన కన్న బిడ్డ సుఖం కోసం అన్నింటినీ భరించింది. అటువంటి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నీ చదువుని తిరిగి ప్రారంభించు నీ తెలివితేటలతో మంచి స్థాయికి వచ్చినరోజు అప్పుడు అప్పుడు చూడు ఈ ప్రపంచం ఎంత అందంగా కనపడుతుందో. ఈరోజు మిమ్మల్ని కాదనుకొని వెళ్లిపోయిన వాళ్లంతా నీ కాళ్ళ దగ్గరకి వస్తారు. దీనంతటికి నువ్వు చేయాల్సింది ఒక్కటే బాగా చదువుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగడం. అని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి ఓదార్చాను.


 ఆ తరువాత కొన్ని రోజులకి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మా మధ్య ఉత్తరాలు నడిచాయి, ఆ తర్వాత ఎటువంటి కబురూ లేదు, ఏది ఏమైనా వాళ్లిద్దరూ మంచిగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇన్నేళ్ళకి ఇప్పుడిలా తనని చూస్తానని అనుకోలేదు. ఇన్నేళ్ళ నా ఉపాధ్యాయ వృత్తికి ఎంతోకొంత న్యాయం చేయగలిగాను అని ఎంతో సంతోషించాను. ఆ సంతోషంలోనే నా ఉపాధ్యాయ పదవికి విరమణ చేసాను. ఇంటిల్లిపాదికీ చదువు దేశానికే వెలుగు. Rate this content
Log in

More telugu story from gowthami ch

Similar telugu story from Inspirational