ప్రేమ పిపాసి
ప్రేమ పిపాసి
ఓ ప్రియా ఇది నీకు నేను రాసే మొదటి ప్రేమలేఖ కాదు కాదు నాకు నేను రాసుకుంటున్న ప్రేమలేఖ ఎందుకంటే నా దృష్టిలో నువ్వు ఎప్పుడో నాలో సగమైపోయావు నా ప్రాణంలో ప్రాణమై ఆలోచనలలో రూపమై ఎప్పుడూ నాలోనే నాతోనే ఉన్నావు నిన్ను చూసిన మొదటి క్షణం నన్ను నేను మరచిపోయాను ఆ తరువాత నుండి నన్ను తాకే గాలి సైతం ఊసులనే వినిపిస్తుంది , నేను చూసే ప్రతిచోటా నీ జ్ఞాపకాలే ,నన్ను పిలిచే ప్రతి పిలుపు నీ మధుర స్వరంలా వినపడుతోంది , నేను వేసే ప్రతి అడుగు నీ జతనే కోరుతుంది. అప్పుడే తెలిసింది నాకు , నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అది నీకు కూడా తెలుసు అయినా నీ మౌనమనే బంధికాణాలో నవ్వు అనే సంకెళ్లతో నన్ను బంధించావు ఐనా కూడా ఏదో ఒక నాడు ఆ నవ్వు అనే సంకెళ్లని దాటి మనసు అనే బంధం తో నన్ను అల్లుకుంటావని ఆశ. నీ చెయ్యి అందుకోవడమే నా చిరకాల వాంఛ , దానికోసం ఎన్ని క్షణాలైనా ఎన్ని యుగలైనా వర్షపు నీటి కోసం ఎదురుచూసే చేకొర పాక్షిలాగా ఎదురుచూస్తూ ఉంటాను. అలా నీ చేతిని అందుకున్న క్షణం
నేను పలికే ప్రతి పలుకు నీ
కొరకై
నేను నడిచే ప్రతి అడుగు నీ గెలుపుకై
నా చివరి శ్వాస వరకు నీ చెయ్యి విడువనని మాటిస్తున్నాను.
ఇట్లు
నీ ప్రేమ పిపాసి