gowthami ch

Inspirational

4.4  

gowthami ch

Inspirational

స్నేహితురాలి లేఖ

స్నేహితురాలి లేఖ

3 mins
757


"మీరు ఇంత గొప్ప రచయిత్రి అవ్వడం పట్ల మీ భావన మాతో పంచుకుంటారా? " ఆడిగారు విలేఖరి.


"తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. నేను ఇంత గొప్ప రచయిత్రి అవ్వడం పట్ల నా భావన అడిగారు కదా. అసలు నేను గొప్ప రచయిత్రి అన్న భావనే నాకు లేదు . ఏదో నాకు మనసుకు నచ్చిన ఒక పని గా భావించి రాసానే తప్ప గొప్ప రచయిత్రి అవ్వాలని ఎన్నడూ అనుకోలేదు.


నాకు సాధారణంగా రాయడం అంటే ఇష్టం ఆ ఇష్టమే నన్ను ఇలా ఇన్ని రచనలు చేసేలా చేసింది అంతే." అంది భారతి.


"మీరు రాసే రచనలలో అధిక శాతం స్ఫూర్తి దాయకమైనవే ఉండడానికి ఏదైనా బలమైన కారణం ఉంది అనుకోవచ్చా?"


"తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే నా జీవితం కూడా అందరి లాగే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి మొదలైంది. పుట్టుకతో ఎవరూ రచయిత/ త్రి కావాలి అనుకోరు కదా. కొందరికి పరిస్థితులు కారణం అవ్వొచ్చు మరికొందరికి వంశపారంపర్యం కావచ్చు మరికొందరికి ఇంకేవో కారణాలు కావచ్చు.


అలాగే నాకు ఒకప్పుడు ఈ రచనల పట్ల అసలు అవగాహన లేదు. పైగా చదవడం , రాయడం అంటే చిరాకు అందులోనూ రచనలు అంటే ఎక్కువ సేపు కూర్చొని చదవాలి అనే ఉద్దేశ్యంతో వాటి జోలికే వెళ్ళేదాన్ని కాదు. "


"ఇంత గొప్ప రచయిత్రి అయిన మీరు అసలు కథలు చడవను అనడం ఆశ్చర్యంగా ఉంది అండి." అన్నారు విలేఖరి.


"ఇందులో ఆశ్చర్యం ఏముంది ఒకప్పుడు చదివేదాన్ని కాదు అన్నాను కానీ ఇప్పుడు కాదు గా.


అప్పుడు నాకు ఒక స్నేహితురాలు ఉండేది పవిత్ర అని తనకి ఈ రచనలన్నా , నవలలన్నా విపరీతమైన పిచ్చి కొత్త నవల ఏది వచ్చినా వదిలేది కాదు.


అందులోనూ తను చదివిన నవల లేక రచన ఏదైనా సరే బాగుంది అనిపిస్తే చాలు దానిని పక్కన వాళ్ళకి వినిపించే వరకు నిద్ర పట్టదు తనకి అలా ప్రతిరోజు తన రచనలకి నేను బలి ఐపోయేదాన్ని.


రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ రోజు మొత్తం చదివినది అంతా నాకు వినిపించేది అలా వింటూ వింటూ నేను నిద్రపోయేదాన్ని. అలా రచనలతో నాకు పరిచయం ఏర్పడింది.


కొంత కాలానికి పై చదువుల రీత్యా ఇద్దరం దూరమయ్యామనే కానీ ప్రతిరోజు ఫోన్ చేసి మరీ కథలు వినిపించేది. అలా అలా కొంత కాలం మా మధ్య మాటలు కొనసాగాయి. ఆ తరువాత తనకి పెళ్లి అయ్యి వెళ్ళిపోయింది. ఆ తరువాత మా మధ్య ఉత్తరాలు రాయబారం మోసాయి.


కొంత కాలానికి ఒక రోడ్డు ప్రమాదంలో నా తల్లి తండ్రులని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాను ఆ బాధలో చాలా కాలం ఎవరితో మాట్లాడలేదు. ఒంటరిగా బాధపడుతూ ఉండేదాన్ని ఆ క్షణం లో వచ్చింది నా స్నేహితురాలి నుండి ఒక లేఖ ఆ లేఖ నా జీవితాన్ని మార్చేసింది. " అంటూ ఆ ఉత్తరంలో మాటలు ఇలా చెప్పడం మొదలు పెట్టింది.


"ప్రియమైన భారతికి


నీ స్నేహితురాలు పవిత్ర రాయునది ఏమనగా. నువ్వు గత కొంత కాలం గా ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటంలేదు దానికి కారణం కూడా నాకు తెలుసు కానీ ఇలా ఎంతకాలం దూరమైన వాళ్ళని తలచుకొని దిగులు పడతావు.


నీ తల్లి తండ్రులు బ్రతికి ఉండి ఉంటే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోగలిగే వారా. నీ మీద వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఆశలన్నీ ఆడియాసలేనా. వారు నీతో ఉన్నా లేకున్నా నీ విజయాన్ని మాత్రం తప్పకుండా కోరుకుంటారు. చనిపోయి ఏ లోకంలో ఉన్నారో తెలియదు కాని అక్కడ కూడా వారు నీ గురించి ఆలోచిస్తారని , నిన్ను చూస్తూనే ఉన్నారని నమ్మితే వెంటనే వాళ్లు కోరుకున్న సంతోషాన్ని వాళ్ళకి అందించు.


నీ కంటూ మరచిపోలేని స్నేహితురాలు ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకో ఈరోజు నుండి ప్రతిరోజు నీ మనసులోని బాధలు , ఆనందాలు ఏదైనా సరే పంచుకోవడానికి నీకు నేనున్నాను.


తప్పుగా అనుకోకు నీ కోసం కొన్ని బుక్స్ పంపుతున్నాను వాటిని చదివితే నీ మనసు కాస్త కుదుట పడుతుందనే ఉద్దేశ్యంతోనే నీకు పంపుతున్నాను. ఈ లేఖ లోని మాటలు నేను ఫోన్ లో కూడా చెప్పగలను కానీ ఫోన్లో మాట్లాడిన మాటలు ఆ క్షణం వరకు ధైర్యాన్ని ఇవ్వొచ్చు కానీ మనసుపెట్టి చదివిన మాటలు జీవితాంతం గుర్తుంటాయి ఒంటరి వేళలో మనకు ఒక తోడుగా అండగా కూడా అనిపిస్తాయి.


ఇట్లు

ఎల్లప్పుడూ నీ మంచి కోరే నీ స్నేహితురాలు పవిత్ర.


తను రాసిన ఈ లేఖ లోని ప్రతి అక్షరం నాకు ఇప్పటికి గుర్తున్నాయి అంటే మీరే అర్ధం చేసుకోండి. ఇదే కాదు తను రాసిన ప్రతి లేఖ నాకు గుర్తుంది అంతలా నన్ను తన లేఖలు ప్రభావితం చేసాయి. అందుకేనేమో మాటల కంటే చేతలే గొప్పవి అంటుంటుంది ఎప్పుడూ. "అంది భారతి.


ఇలా భారతి చెప్తూ ఉంటే అక్కడి విలేఖర్లు అందరూ ఎంతో శ్రద్ధగా ఆవిడ చెప్పేది అంతా వింటున్నారు.


ఇలా ఆ రోజు నా స్నేహితురాలు పంపిన లేఖ ఈరోజు నా జీవితాన్ని ఇలా మార్చింది.


"అదెలానో కొంచెం వివరంగా చెప్పగలరా." అని అడిగాడు విలేఖరి.


"ఆ ఉత్తరం తను నాకు పంపిన 2 నెలల తరువాత చదివాను అప్పటికి ఇంకా నా తల్లి తండ్రులని తలచుకొని బాధపడుతూనే ఉన్నాను. చివరకు చనిపోదాం అని నిర్ణయించుకున్నాను ఆ క్షణం లో ఎందుకో తను రాసిన ఆ లేఖ చదవాలి అనిపించి తీసాను. దానితో పాటు తను పంపిన పుస్తకాలు కూడా చదివాను.


ఆ తరువాత తను చెప్పినట్లుగా నా తల్లితండ్రులు నాతోనే ఉన్నట్లు భావించి వారి సంతోషం కోసం నేను సంతోషంగా ఉండడం మొదలుపెట్టాను. నా మనసులో బాధలు , సంతోషాలు అన్నీ తనకి లేఖలుగా రాయడం మొదలుపెట్టాను.


తను పంపే ప్రతి లేఖ నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసాయి. ఆ తరువాత తను ఇచ్చిన సలహా మేరకు నా ఆలోచనలు అన్నింటినీ ఒక కథగా మలచి అక్షర రూపం ఇచ్చాను అదే నా మొదటి రచన 'నా జీవితం.'


ఇలా ఒక్కొక్కటిగా రాయటం మొదలుపెట్టాను ఆ రాసే క్రమంలోనే రచనలు చదవడం పట్ల ఆసక్తి కలిగి చదవడం కూడా మొదలు పెట్టాను ఆ తరువాత నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రతి కదలికలో నా రచనలే కనపడ్డాయి. ఇది నా ప్రయాణం.


అలా నా స్నేహితురాలి లేఖ నా విజయానికి కారణం అయింది. అంటూ స్నేహితురాలికి తలచుకొని బాధపడింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational