gowthami ch

Tragedy

4.7  

gowthami ch

Tragedy

చెట్లు మాట్లాడితే

చెట్లు మాట్లాడితే

2 mins
627


అప్పుడే ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు శేషు , నేత్ర మరియు వాళ్ళ బాబు దేవా.


కొంచెం దూరం నడవగానే "అమ్మా సుస్సు వస్తున్నాయి" అన్నాడు దేవా.


"ఇప్పటివరకూ ఇంట్లోనే ఉన్నావు కదా, అప్పుడు అడిగితే రాలేదు అన్నావు తీరా బయటకి వచ్చామో లేదో సుస్సు అంటూ మొదలుపెట్టావు పో పొయ్యి ఆ చెట్టు వెనక పోస్కో" అని అరుస్తుంది నేత్ర.


"అది, అలానే ఇంక నాలుగు తిట్టమ్మా వాడిని. వేలేడు అంత లేడు వెధవ రోజూ ఇక్కడే పోస్తాడు సుస్సు. అదేంటో మరి నన్ను చూడగానే పోయాలి అనిపిస్తుందో ఏంటో వీడికి. "


దేవా సుస్సు పోస్తుంటే "అబ్బా ఎంత సేపటి నుండి ఆపుకొని చచ్చావురా ఇంతసేపు పోస్తున్నావు. త్వరగా కానివ్వు."


దేవా తన పని ముగించుకొని అటు వెళ్లాడని కాస్త ఊపిరి పీల్చుకుందో లేదో "మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం" అని పాడుకుంటూ వచ్చాడు కేశవరావు.


సరిగ్గా అక్కడికి రాగానే ప్రకృతి పిలవడంతో ఆ చెట్టు చాటుకి వెళ్లి పని కానిచ్చేసాడు.


దారిన పోయే ప్రతీ అడ్డమైన వెధవకీ నేనే దొరికానా ఈ పనికి. నన్నేమన్నా శులబ్ కాంప్లెక్స్ అనుకుంటున్నారా ఏంటి. కంపు భరించలేకపోతున్నాను. ఇలానే ఉంటే కొంతకాలానికి మేము ఉండేది దాని కోసమే అని మేమే భావించేలా మార్చేస్తారు వీళ్ళు. కేశవరావు అలా వెళ్ళగానే ఇద్దరు వ్యక్తులు చేతిలో గొడ్డళ్లు పట్టుకొని వచ్చారు. కిందనుండి పై దాకా చూసారు.


అదేంటిరా అలా విచిత్రంగా చూస్తున్నారు. ఎక్కడ కాళీఉందా పోయడానికి అనా? మీరెంతసేపు చూసినా మీకు ఒక అంగుళం చోటు కూడా దొరకదు అనుకుంటుండగానే... ఆ చేతిలోని గొడ్డళ్ళతో నరకడం మొదలు పెట్టారు.


"అరే ఏంటి రా మీరు చేసే పని. మీకు నేనేమి అన్యాయం చేసాను. నన్నెందుకు నరుకుతున్నారో చెప్పండి?" అని రోధిస్తున్నా వినకుండా తమ పని తాము చేసుకు పోతున్నారు ఇద్దరూ.


ఇంతలో ఇంకా కొంత మంది వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నింటినీ నరకడం మొదలు పెట్టారు.


"అయ్యో ఎందుకు మమ్మల్ని నరికేస్తున్నారు? దయచేసి మమ్మల్ని నరకొద్దు. మేము మీకు ఏ అన్యాయం చేయలేదు సరికదా మీ జీవనానికి ఆధారమైన ఆక్సిజన్ ని మీకు ఇస్తున్నాం.


"మీ అమ్మ కూడా 9 నెలలు మాత్రమే కడుపులో పెట్టుకొని కాపాడింది కానీ మేము మీరు బ్రతికి ఉన్నంత కాలం మీతో ఏ సంబంధం లేకపోయినా మీ జీవనానికి అవసరమైన ప్రాణవాయువుని అందిస్తూ మిమ్మల్ని కపడుతున్నాం. అయినా ఎందుకు మమ్మల్ని నరికేస్తున్నారు" అంటూ కన్నీరుపెట్టుకున్నాయి.


"వాళ్ళు అంతే, మారరు. ఎంతైనా మనుషులు కదా మనలాంటి మూగప్రాణుల బాధ వాళ్ళకి పట్టవు. అన్నం పెట్టిన చేతినే నరకగల సమర్థులు ఇక మనమెంత.


"మన అవసరం ఉన్నన్నాళ్లు మనల్ని వాడుకున్నారు ఇప్పుడు మన అవసరం లేదని తెలియగానే ఇలా నిర్ధాక్షిణ్యంగా నరికేస్తున్నారు. ఎటువంటి వారు కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తమ స్వార్ధం చూసుకుంటారు కానీ మనం శివుడు హాలాహలాన్ని మింగి అమృతాన్ని దేవుళ్ళకు ఇచ్చినట్లుగా మనం వీళ్లు వదిలే కార్బన్ డయాక్సయిడ్ అనే విషాన్ని తీసుకొని వాళ్ళ జీవించడానికి అత్యవసరమైన ఆక్సిజన్ ని అందిస్తున్నాం.


"ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా మనల్ని పునాధులతో సహా నరికి వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు. ఏదైనా అంతా జరిగిపోయిన తరువాత బాధపడటం అలవాటే గా ఈ మనుషులకు చెట్లు అన్నీ అంతరించి పోతే కానీ వాళ్ళకి మన విలువ తెలిసిరాదు." అంటూ నేలకు ఒరిగిపోయాయి.



Rate this content
Log in

Similar telugu story from Tragedy