gowthami ch

Drama

5.0  

gowthami ch

Drama

నా అహం

నా అహం

3 mins
447


"ఏమ్మా ఎలా ఉంది కొత్త ఇల్లు , కొత్త కాపురం?" అంటూ ఫోన్లో అడుగుతున్న అమ్మతో "అంతా బాగానే ఉంది అమ్మ. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు." అంది స్వప్న.


"చాలా మంచి వార్త చెప్పావు తల్లి నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండడమే మాకు కావలసింది. పుట్టింట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇలా ఒక్కసారిగా పరాయి వాళ్ళింటికి పంపిస్తున్నామే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని ఒకటే ఆలోచన నాకు , మీ నాన్న గారికి. ఇప్పుడు నీ మాట విన్నతరువాతే కొంచెం కుదుటపడింది ప్రాణం."

అంది స్వప్న వాళ్ళ అమ్మ.


"మీరేమి బయపడవలసిన పని లేదమ్మా ఆయనే కాదు అతయ్యా , మామయ్య కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. పెళ్ళయ్యి 4 నెలలు అయినా కూడా ఇప్పటివరకు అత్తయ్య గారు నాకు ఏ పనీ చెప్పడంలేదు. నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది మీరేమి ఖంగారు పడవలసిన పనిలేదు అని నేను చెప్పాను అని నాన్న కి చెప్పు. "


"అలాగే తల్లి ఇంక ఉంటాను జాగ్రత్త. "అని ఫోను పెట్టేసింది స్వప్న వాళ్ళ అమ్మ.


"అమ్మాయ్ స్వప్నా... నేను మీ అత్తయ్య గారు ఒక నెల అలా తీర్ధయాత్రలకి వెళ్ళొస్తాం అమ్మాయి. ఇన్ని రోజులు ఇల్లు , పిల్లలు, భర్త అంటూ ఇల్లే ప్రపంచంగా బ్రతికింది కనీసం ఒక సినిమాకో , గుడికో కూడా తీసుకెళ్లమని ఎప్పుడూ అడగలేదు మీ అత్తయ్య అందుకే ఇప్పుడు ఎలాగో మీకు పెళ్లి అయిపోయింది.


"ఒక నెల రోజులు మేమిద్దరం అలా బయటకి వెళ్తే మీకు కూడా ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం ఉంటుంది. మాకు కూడా ఒక నెల ఈ బాధర బంధీలనుండి విముక్తి లభిస్తుంది. పుణ్యానికి పుణ్యం ప్రశాంతతకు ప్రశాంతత లభిస్తుంది. " అన్నాడు వాళ్ళ మామయ్య.


"అలాగే మామయ్య గారు మీ ఇష్టం. క్షేమంగా వెళ్లి రండి" అంటూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది.


"స్వప్నా....అమ్మ వాళ్ళని బస్ ఎక్కించి వస్తాను." అంటూ బాగ్ లు తీసుకొని బయలుదేరాడు భర్త శ్యాం.


చూస్తుండగానే నెల రోజులు గడిచి పోయాయి తీర్ధయాత్రలకి వెళ్లిన అత్తగారు , మామగారు తిరిగి వచ్చేసరికి మంచి శుభవార్త చెప్పారు కొడుకు , కోడలు.


వాళ్ళ ఆనందానికి అవధులు లేవు 9 నెలలు స్వప్న ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పండంటి బాబుకి జన్మనిచ్చింది స్వప్న.


బాబు పుట్టిన తరువాత వాళ్ళ జీవితాలలోకి కొత్త వెలుగు వచ్చినట్లుగా అందరి మొహాలలో సంతోషం నిండిపోయింది. చూస్తుండగానే బాబుకి 3 వ సంవత్సరం కూడా వచ్చేసింది.


మంచి రోజు చూసి అక్షరాబ్యాసం చేయించి స్కూల్ కి పంపడం మొదలు పెట్టారు.


"న్నాన్నా చందూ... స్కూల్ లో పాస్ వస్తే మీ టీచర్ కి చెప్పి బాత్రూం కి వెళ్లి పోసుకోవాలి సరే నా.?"


"స్కూల్ లో పాస్ వస్తే డ్రాయర్ లో పోసేయాలి సరేనా" అంటూ తిరిగి సమాధానం చెప్తున్న చందుని చూసి అందరూ నవ్వుకున్నారు.


"ఏరా ఎన్ని సార్లు చెప్పాలి నీకు డ్రాయర్ లో పాస్ పొయ్యిద్దు అని." అంటూ కోపంగా అరుస్తున్న భార్యని చూసి ఎందుకు స్వప్న వాడిని అలా అరుస్తున్నావు.


"మరి వీడు చేసే పని చూడండి కావాలని పాస్ డ్రాయర్ లో పోస్తున్నాడు."


"కావాలని అయ్యుండదులే స్వప్న. చిన్న పిల్లాడు వాడికెమి తెలుసు. "


నాన్న అలా అంటుండగానే కావాలని నవ్వుతూ ద్రవెర్ లో పాస్ పోస్తున్నాడు చందు.


"ఇప్పుడు మీరే చూడండి . డ్రాయర్ మార్చి ఒక్క నిముషం కాలేదు అప్పుడే మరలా పోస్తున్నాడు. డ్రాయర్ వేసేటప్పుడు కూడా అడిగాను వస్తున్నాయా అని రాలేదు అన్నాడు" మరి ఇప్పుడు చూడండి.


"ఎరా చందు అలా చేయడం తప్పు కదా?"


"సరే నాన్న ఇంక చేయను." అంటూ అమాయకంగా మొహం పెట్టి అన్నాడు చందు.


మారుసటి రోజు చందు ని తీసుకొని తిరణాల కి వెళ్లారు స్వప్న మరియు శ్యాం. "నాన్న నాకు ఆ బొమ్మ కావాలి" అని మారం చేస్తున్నాడు చందు.


"ఇప్పుడు కాదు నాన్న రేపు బయటకి వెళ్ళినప్పుడు పెద్దది కొనుక్కుందాం ఇప్పుడు వద్దులే" అంటూ బుజ్జగిస్తున్నాడు శ్యాం.


ఎంత బుజ్జగించినా, అరిచినా వినకపోవడంతో సరే అని కొనిచ్చాడు శ్యాం.


"ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి మారం చేస్తున్నాడు అండి. అసలు ఏదైనా కావాలి అనుకొంటే అది ఇవ్వాల్సిందే లేకుంటే అసలు ఒప్పుకోవట్లేదు. పైగా కోపం కూడా వస్తుంది వీడికి. ఈ వయసులోనే ఎంత అహం వాడికి.


"కొడితే ఇంకా ఎక్కువ చేస్తున్నాడే కానీ తగ్గడం లేదే!! పుట్టుకతోనే ఇంత అహం వాడికి ఎలా వచ్చిందండి?"


"ఇంకెలా వస్తుంది తమరి నుండే వచ్చి ఉంటుంది." అన్నాడు శ్యాం నవ్వుతూ.


"నా నుండా!.. నాకేం అహం ఉందండి? "


"మరి లేదా?...ఎప్పుడు ఏ చిన్న మాట అన్నా కూడా పడవుగా..ఇంతెత్తున యుద్ధానికి వస్తావు నా మీద. నీ మాటే నెగ్గించుకుంటావుగా ఎలాగైనా. అదే వచ్చి ఉంటుంది వాడికి కూడా."


"నేనేమి అలా కాదు మీరే కావాలని నన్ను ఏడిపిస్తుంటారు." అంటూ బుంగమూతి పెట్టింది స్వప్న.


సర్లే స్వప్న ఊరికే అన్నానులే పద ఇక పోదాం అంటూ ఇంటికి వెళ్లిపోయారు. 


Rate this content
Log in

Similar telugu story from Drama