gowthami ch

Comedy

4.2  

gowthami ch

Comedy

నాటికలో భూమిక

నాటికలో భూమిక

8 mins
897


"భూమి..! త్వరగా అన్నం పెట్టు బయట కొంచెం ఆర్జంట్ పని ఉంది వెళ్ళాలి." చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు పవన్. "అలాగే అండి" అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి. ఒక్కో పదార్థం మూత తీసి చూస్తూ "ఏంటో! ఈరోజు వంటలు?" అంటూ, ఉన్నట్లుండి "భూమీ!... భూమీ! ఏంటి ఇది ఇలా ఉంది..?" అనడిగాడు గిన్నెలో ని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ.

"అదా...! బెండకాయ తాలింపు అండి" అంది చేతిలోని నీళ్ళ గ్లాస్ పక్కన పెడుతూ. "బెండకాయ నా...! మరి ఇలా ఉందేంటే నల్లగా పొయ్యిలోని బొగ్గుల్లా" అని అడిగాడు పవన్. "అదేం లేదండి, టీవీ లో 'ఆమె అలిగింది' , నాటిక లో ఆ మీనాక్షి, మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది, పాపం..." "అయితే ! దానికీ ఈ కూర మాడడానికి ఏంటే సంబంధం" అనడిగాడు పవన్.

"అది చూస్తూనే, పొయ్యి మీద తాలింపు సంగతి మరచిపోయాను. తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది" అంటూ గిన్నెలోని బెండకాయ వైపు జాలిగా చూసింది .

"ఆవిడ భర్త కడుపు మాడ్చిందని, నువ్వు పొయ్యిమీద కూర మాడ్చావా? అంటూ ఇంకో గిన్నె మూత తీసి "ఇదేంటి ఇది" అని చూసాడు. "హమ్మయ్యా... కనీసం పప్పు అన్నా సరిగ్గా చేసావు, ఈ పూటకి ఇది చాల్లే" అంటూ పప్పు వేసుకొని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొన్నాడోలేదో "అమ్మా...కారం , మంట, మంట..."అని అరుస్తూ, "ఏంటే ఇది?! ఇంత కారంగా ఉంది, మిరపకాయలు వేశావా! లేక ఇంకేమైనా వేశావా? ఇందులో, నోరు మండిపోతుంది" అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ళ గ్లాస్ అందిస్తూ "అయ్యో అంత కారంగా ఉందా అండి. 'నాకొద్దీ కోడలు' నాటికలో అత్త, కోడలి మీద కారాలు మిరియాలు నూరుతుంది అండి అది చూస్తూ మరచిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసేసినట్లున్నాను" అంది అమాయకంగా. "రెండు కాదే, ఒక కిలో మిరపకాయలు వేసేసినట్లున్నావు. నేను నీకేమి అన్యాయం చేసానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగ అన్నా ఉన్నాయా లేక అవికూడా నాటికలు చూస్తూ తోడు వేయడం మరచిపోయావా?" కోపంగా అడిగాడు పవన్ . "ఛా... మీరు మరీను.. అది మరచిపోలేదు లెండి, అది రాత్రి వేసాను కదా ఆ సమయంలో ఏ నాటికలు లేవు లే. "అంది నవ్వుతూ భర్త బుగ్గ గిల్లుతూ.

"హమ్మయ్యా... బ్రతికించావు ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే వెయ్యి త్వరగా" అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉస్సు... ఉస్సు అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్. భోజనం ముగించుకొని బయటకి వెళ్ళిపోయాడు.

*****

టీవీ లో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య, పక్కనే కూర్చున్న తండ్రితో "నాన్నా...! పెళ్ళంటే ఏంటి నాన్నా?" అని అడిగింది. "పెళ్ళంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష బంగారం." అన్నాడు భార్య వైపు చూస్తూ. "మరి మాకెంటో.. ?" అని అడిగింది భూమి. "మీకు యావజ్జీవ స్వేచ్ఛ." అన్నాడు నవ్వుతూ. "తిప్పి చెప్పినట్లున్నారు" అంది మొహం తిప్పుకుంటూ. "అవునా..! అయితే ఇప్పుడే సరి చేస్తాను" అంటూ "పెళ్ళంటే మీకు స్వేచ్ఛ....జీవితాంతం..." అన్నాడు సాగదీస్తూ. "తిప్పి చెప్పమంది మాటల్ని కాదు మనుషుల్ని" అంది కోపంగా చూస్తూ. "మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న ." అడిగింది భవ్య."మంగళసూత్రం అంటే ....అంటే...అంటూ కొంతసేపు ఆలోచించి, "అది మగవాడి మెడకు ఉరి" అన్నాడు. "మరి మా మెడలో ఎందుకు వేస్తారో?" భర్త వైపు కొర కొర చూస్తూ అడిగింది భూమి. "మీ మెడలో వేస్తాము కాబట్టే అది మాకు ఉరి అయింది. మీ చెత్తుల్లోనే కదా మా ప్రాణం ఉండేది, అని సింబాలిక్ గా చెప్పడానికి "అన్నాడు పవన్ భార్య మొహంలో కోపం చూడాలని.

"చాల్లే మీ పెళ్ళి కబుర్లు, ఇలా లేని పోనివి చెప్పి పిల్లని ఎందుకు పాడు చేస్తారు. రండి లేచి కాళ్ళు కడుక్కోండి అన్నం వడ్డిస్తాను. " అంటూ విసుగ్గా వంటగదిలోకి వెళ్ళిపోయింది భూమిక."ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి?" అడిగాడు పవన్. "ఏమి పాపం.... బెంగ గా ఉందా దాని మీద." అంది గిన్నెలని టేబుల్ మీద సర్దుతూ. "ఛి...ఛి....అలాంటిది ఏమి లేదు..ఊరికే అడిగాను.." అన్నాడు. "దాని మొగుడికి ఒంట్లో బాగలేదంట అందుకే ఒక వారం సెలవు పెట్టింది. " అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ. "అయ్యో పాపం..." అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్. "రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక కిలో పళ్ళు , ఒక కిలో స్వీట్స్ , ఒక 2 మూరల మల్లెపూలు తీసుకెళ్ళి పలకరించి రండి." అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ. "హ..అలాగే.." అన్నాడు ఏదో ఆలోచిస్తూ.

కూర వడ్డిస్తూ ఆగి, భర్త వైపు చూసి "ఏంటి..." అని గట్టిగా అరిచింది. "ఛి...ఛి....నా ఉద్దేశ్యం అది కాదు, ఎప్పటినుండో మనింట్లో పని చేస్తోంది కదా పాపం, ఒకసారి పరామర్శించి, ఏమైనా డ...బ్బు స..హా..యం, కావాలేమో అని..." అన్నాడు మెల్లిగా గొణుగుతూ. "అంతగా కావాలంటే ఆ సహాయమేదో నేనే చూస్తానులే...ముందు తిని వెళ్ళి పడుకోండి. " అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమిక.

*****

"రాను రాను నీ సీరియల్స్ పిచ్చి ఎక్కువైపోతుంది భూమి..ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు.." అన్నాడు విసుగ్గా, పాప ని చేతుల్లోకి తీసుకుంటూ. "అంటే! నాకు విడాకులు ఇచ్చి వేరేదాన్ని పెళ్ళి చేసుకుంటారా!!? నాకు ముందే... తెలుసు! మీరు ఇటువంటిదేదో చేస్తారని , ఆ పనిమనిషి గురించి బాధ పడ్డప్పుడే అనుమనించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి, పెళ్ళి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది." అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నేల మీద కూర్చొని సోకాలు పెట్టడం మొదలుపెట్టింది.

"అహేయ్...ఆపు నీ దొంగ ఏడుపు"అంటూ కసిరాడు. "నా మొగుడు... నా మొగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నందుకు, నన్ను నేను కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు" అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. "ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు నీకు ఇన్ని నీతులు చెప్పిన ఆవిడ. ఆవిడ అడ్రస్ చెప్పు ముందు?" అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ.

" 'గన్నేరు పప్పు' నాటికలో సుధాకర్ మూడో పెళ్ళానికి స్వయానా మేనత్త లెండి" అంది. "అమ్మా..! 'ఆరిపోయే దీపం' , నాటిక మొదలైంది అమ్మా..!" అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకుని, టీవీ దగ్గరకు పరుగుతీసింది భూమిక. అలా వెళ్తున్న భార్యని చూసి "ఇప్పుడు ఏమైందే నీ ఏడుపు!!?" అని అడిగాడు. "నాటిక ఐపోయిన తర్వత వచ్చి ఏడుస్తానులేండి" అంది టీవీ ముందు కూర్చుంటూ. భార్య మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక చేతితో తలబాదుకొని బయటకి నడిచాడు పవన్.

****((********Full story

"భూమి..! త్వరగా అన్నం పెట్టు బయట కొంచెం ఆర్జంట్ పని ఉంది వెళ్ళాలి" అంటూ చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నాడు పవన్.

"అలాగే అండి" అంటూ వంటింట్లో నుండి గిన్నెలు తెచ్చి టేబుల్ మీద సర్దుతుంది భూమి. "ఏంటో ఈరోజు వంటలు?" అంటూ ఒక్కో పదార్థం మూత తీసి చూస్తున్నాడు పవన్. "భూమి... భూమి ఏంటి ఇది ఇలా ఉంది..!" అనడిగాడు గిన్నెలో ని పదార్థం వైపు విచిత్రంగా చూస్తూ.

"అదా...! బెండకాయ తాలింపు అండి" అంది చేతిలోని నీళ్ల గ్లాస్ పక్కన పెడుతూ. "బెండకాయ నా...! మరి ఇలా ఉందేంటే నల్లగా పొయ్యిలోని బొగ్గుల్లా" అని అడిగాడు పవన్.

"అదేం లేదండి, టీవీ లో ఆమె అలిగింది నాటిక లో ఆ పంకజం మొగుడి మీద అలిగి మొగుడికి అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది పాపం. అది చూస్తూ పొయ్యి మీద తాలింపుసంగతి మరచిపోయాను. తీరా గుర్తొచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది" అంటూ గిన్నెలో ని బెండకాయ వైపు చూపించింది అమాయకంగా.

"ఆవిడ భర్త కడుపు మాడిచిందని నువ్వు పొయ్యిమీద కూర మాడ్చావా? నాకొద్దు ఇది. ఇంకేమైనా ఉంటే పెట్టు. ఇదేంటి ఇది" అంటూ ఇంకో గిన్నె మూత తీసి చూసాడు. "హమ్మయ్యా... కనీసం పప్పు అన్నా సరిగ్గా చేసావు, ఈ పూటకి ఇది చాల్లే" అంటూ పప్పు వేసుకొని కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని "అమ్మా...కారం , మంట, మంట..."అని అరుస్తూ "ఏంటే ఇది? ఇంత కారంగా ఉంది మిరపకాయలు వేశావా! లేక ఇంకేమైనా వేశావా? ఇందులో నోరు మండిపోతుంది" అంటూ అరుస్తున్న భర్తకి పక్కనే ఉన్న నీళ్ల గ్లాస్ అందిస్తూ "అయ్యో అంత కారంగా ఉందా అండి. నాకొద్దీ కోడలు నాటికలో అత్త, కోడలి మీద కారాలు మిరియాలు నూరుతుంది అండి అది చూస్తూ మరచిపోయి ఒక 2 మిరపకాయలు ఎక్కువ వేసేసినట్లున్నాను" అంది భర్త వైపు జాలిగా చూస్తూ.

"రెండు కాదే, ఒక కిలో మిరపకాయలు వేసేసినట్లున్నావు. నేను నీకేమి అన్యాయం చేసానే ఇలా చంపుతున్నావు, కనీసం మజ్జిగ అన్నా ఉన్నాయా లేక అవికూడా నాటికలు చూస్తూ తోడు వేయడం మరచిపోయావా?" కోపంగా అడిగాడు పవన్ .

"ఛా... మీరు మరీను.. అది మరచిపోలేదు లెండి అది రాత్రి వేసాను కదా ఆ సమయంలో ఏ నాటికలు లేవు లే. "అంది నవ్వుతూ భర్త వైపు చూస్తూ.

"హమ్మయ్యా... బ్రతికించావు ఈ మంట తగ్గాలంటే మజ్జిగ పడాల్సిందే వెయ్యి త్వరగా" అంటూ నోట్లో మంట తట్టుకోలేకపోతూ ఉస్సు ఉస్సు అంటూ ఊపుకుంటూ అడిగాడు పవన్.

టీవీ లో సినిమా చూస్తూ కూర్చున్న 5 సంవత్సరాల భవ్య, పక్కనే కూర్చున్న తండ్రితో "నాన్నా... పెళ్ళంటే ఏంటి నాన్నా?" అని అడిగింది.

"పెళ్లంటే మగవాడి జీవితానికి యావజ్జీవ శిక్ష."అన్నాడు భార్య వైపు చూస్తూ. "మరి మాకెంటో.. ?" అని అడిగింది భూమి "మీకు యావజ్జీవ స్వేచ్ఛ." అన్నాడు నవ్వుతూ.

"తిప్పి చెప్పినట్లున్నారు" అంది మొహం తిప్పుకుంటూ.

"అవునా..! అయితే ఇప్పుడే సరి చేస్తాను" అంటూ "పెళ్లంటే మీకు స్వేచ్ఛ....జీవితాంతం..." అన్నాడు.

"తిప్పి చెప్పమంది మాటల్ని కాదు మనుషుల్ని" అంది కోపంగా చూస్తూ.

"మరి మంగళసూత్రం అంటే ఏంటి నాన్న ." అడిగింది భవ్య.

"మంగళసూత్రం అంటే ....అంటే...అంటూ కొంతసేపు ఆలోచించి, అది మగవాడి మెడకు ఉరి" అన్నాడు.

"మరి మా మెడలో ఎందుకు వేస్తారో." మూతి ముడుచుకుని అంది భూమి.

"మీ మెడలో వేస్తాము కాబట్టే అది మాకు ఉరి అయింది. మీ చెత్తుల్లోనే కదా మా ప్రాణం ఉండేది. అని సింబాలిక్ గా చెప్పడానికి "అన్నాడు పవన్ భార్య మొహంలో కోపం చూడాలని.

"చాల్లే మీ పెళ్లి కబుర్లు, ఇలా లేని పోనివి చెప్పి పిల్లని ఎందుకు పాడు చేస్తారు. రండి లేచి కాళ్ళు కడుక్కోండి అన్నం పెడతాను. " అంటూ విసుగ్గా వంతగదిలోకి వెళ్ళిపోయింది భూమి.

"ఈరోజు కూడా పంకజం రాలేదా పనిలోకి?" అడిగాడు పవన్.

"ఏమి పాపం.... బెంగ గా ఉందా దాని మీద." అంది గిన్నెలని టేబుల్ మీద సర్దుతూ.

"ఛి...ఛి....అలాంటిది ఏమి లేదు..ఊరికే అడిగాను.." అన్నాడు.

"దాని మొగుడికి ఒంట్లో బాగలేదంట అందుకే ఒక వారం సెలవు పెట్టింది. " అంది భోజనానికి రమ్మని సైగ చేస్తూ.

"అయ్యో పాపం..." అంటూ వచ్చి కూర్చున్నాడు పవన్.

"రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక కిలో పళ్ళు , ఒక కిలో స్వీట్స్ , ఒక 2 మూరల మల్లెపూలు తీసుకెళ్లి పలకరించి రండి." అంది కోపంగా పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ.

"హ..అలాగే.." అన్నాడు ఏదో ఆలోచిస్తూ.

కూర వడ్డిస్తూ ఆగి భర్త వైపు చూసి "ఏంటి..." అని గట్టిగా అరిచింది.

"ఛి...ఛి....నా ఉద్దేశ్యం అది కాదు, ఎప్పటినుండో మనింట్లో పని చేస్తోంది కదా పాపం, ఒకసారి పరామర్శించి, ఏమైనా డబ్బు సహాయం కావాలేమో ఇద్దామని..." అన్నాడు మెల్లిగా గొణుగుతూ.

"అంతగా కావాలంటే ఆ సహాయమేదో నేనే చూస్తానులే...ముందు తిని వెళ్ళి పడుకోండి. " అనేసి లోపలికి వెళ్ళిపోయింది భూమి.

*****

"అది... అలానే కావాలి దానికి, లేకుంటే భర్తనే అనుమానిస్తుందా!" అంటూ నాటికలో లీనమైపోయి చూస్తూ ఉంది భూమిక. "అమ్మా...! ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా..!" అని అడుగుతున్న కూతుర్ని కూడా పట్టించుకోకుండా చూస్తూ ఉంది.

"అమ్మా నా ముక్కు ...నొప్పిగా ఉంది వదులు అమ్మా...! అంటూ అరుస్తున్న పాప గొంతు విని బయటకి వచ్చి చూసిన పవన్...భూమి... భూమి...ఏంటి నువ్వు చేసే పని? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా! దాన్ని వదులు ముందు" అని పాప ని పక్కకి లాగాడు.

"ఇప్పుడేమైందని అంతలా అరుస్తున్నారు." అడిగింది కల్లార్పకుండా నాటిక చూస్తూ.

" ఏమైందా..!!? దాని ముక్కు ఎందుకు మూసిపెట్టావు...ఊపిరాడక కొట్టుకుంటుంది అది, తెలుస్తుందా నీకు. " అని గట్టిగా అరిచాడు పవన్.

"అదా .........! నేను... నా రెండో మొగుడు, నాటికలో కలవక కలవక 6 సంవత్సరాల తరువాత భార్య భర్త కలుసుకుంటుంటే మధ్యలో అపశకునం లా తుమ్ముతుంది ఇది... ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కూడా కలవకపోతే? అందుకే తుమ్ము ఆపడనికి ముక్కు మూశాను" అంది.

"నీ చాదస్తం రాను రాను ఎక్కువైపోతుంది భూమి..ఇలా అయితే నీతో వేగడం నా వల్ల కాదు.." అన్నాడు విసుగ్గా, పాప ని చేతుల్లోకి తీసుకుంటూ.

"అంటే! నాకు విడాకులు ఇచ్చి వేరేదాన్ని పెళ్ళి చేసుకుంటారా?... నాకు ముందే తెలుసు మీ మగవారంతా ఇంతే అని, ఆ పనిమనిషి గురించి బాధ పడ్డప్పుడే అనుమనించాల్సింది. అనవసరంగా మిమ్మల్ని నమ్మి పెళ్ళి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది" అంటూ ఏడవడం మొదలుపెట్టింది.

"అప్పటికీ ఆ సుబ్బులు అంటూనే ఉంది మగవాళ్ళని నమ్మొద్దు అని అయినా నేను వినలేదు" అంటూ ముక్కు చీదుకుంటూ నిలబడిన చోటే నెల మీద కూర్చొని సోకాలు పెట్టడం మొదలుపెట్టింది.

"అహేయ్...ఆపు నీ దొంగ ఏడుపు." అంటూ భూమి ని పైకి లేపాడు పవన్.

"నా మొగుడు నా మొగుడు అంటూ నెత్తిన పెట్టుకున్నాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి. ఆ సుబ్బులు చెప్పిన మాటలు అప్పుడే వినుంటే నాకింత బాధ ఉండేది కాదు" అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది.

"ఇంతకీ ఎవరే ఆ సుబ్బులు నీకు ఇన్ని నీతులు చెప్పిన ఆవిడ. ఆవిడ అడ్రస్ చెప్పు ముందు?" అని అడిగాడు పవన్ వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ.

"గన్నేరు పప్పు నాటికలో సుధాకర్ మూడో పెళ్ళాం కి స్వయానా మేనత్త లెండి" అంది.

"అమ్మా..! ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం నాటిక మొదలైంది అమ్మ" అంటూ అరుస్తూ వచ్చిన భవ్య మాటలు విని టక్కున లేచి కళ్ళు తుడుచుకుని పరుగున హాల్ లోకి వెళ్లి టీవీ ముందు కూర్చుంది భూమిక.

అలా వెళ్తున్న భార్యని చూసి నవ్వాలో ఎడవాలో తెలియక చేతితో తలబాదుకొని బయటకి నడిచాడు పవన్.


Rate this content
Log in

Similar telugu story from Comedy