పెళ్లి చూపులు
పెళ్లి చూపులు
ఉదయాన్నే రూపాలి ఫోన్ రింగ్ అవుతుంది
వెళ్లి చూస్తే babai అని ఉంది అంతే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసింది
( రూపాలి వాళ్ళ నాన్నకు తమ్ముడు )
రూపాలి:
హలో బాబాయ్
ఎలా ఉన్నారు
పిన్ని నిమిషా అక్షయ్ అందరూ బాగున్నారా అని అవతలి వాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా గలగలా వాగుతూనే ఉంది ,అవతల వైపు
బాబాయ్ కాదే
మీ పిన్నిని మాట్లాడుతున్న,
ఏంటి ఒక 2 రోజులు వచ్చి వెల్లమంటే కుదరదన్నావంట బాబాయ్ తో
రూపాలి
అయ్యో పిన్ని మీ అల్లుడిగారికి సెలవుల్లేవు పిన్ని
వీకెండ్ లో వస్తాం అని చెప్పాగాపిన్ని
గురువారం పెళ్లి చూపులైతే వీకెండ్ వచ్చి ఎం చేస్తావే
ఏదో నీ చేతి చలువ బాగుందని నిన్నే వచ్చి నిమిషను రెడి చేయమని ఫోన్ చేశారు మీ బాబాయ్
నువ్వేమో ఇలా మాట్లాడావ్ పాపం అది ఎంతలా బాధ పడుతుందో తెలుసా
అయినా మొన్న మీ మేనమామ కూతుర్ని నువ్వేగా తయారు చేశావ్ పెళ్లి చూపులకు
ఆ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా నిర్విగ్నంగా జరిగింది కదా అని నిన్ను పిలుస్తున్నారే
అయినా మీ చెల్లిని కూడా నువ్వేగా రెడి చేసింది
ఇంటికి పెద్ద కుతురివి అని అన్నింటికీ నిన్ను పిలుస్తారేమో అనుకున్నానే కానీ
నీ చేతి చలువతో వల్ల ఇద్దరి పెళ్లిళ్లు బాగా జరిగి సంతోశంగా కాపురాలూ చేస్కుంటున్నారూ కదా అందుకే దీన్ని కూడా
నీ చేతులతో అలంకరిస్తావని ఎంతో ఆశ పడ్డారు మీ బాబాయ్
నువ్వేమో అలా ఇప్పుడు కుదరదు తర్వత వస్తా అనే సరికి ఆయన కూడా చాలా బాధపడుతున్నారే
అయినా నువ్ కూడా మీ అమ్మలా వేరుబంధాలు వేసి చూస్తావని అస్సలు అనుకోలేదే అంటూ కనీళ్ల కుళాయి విప్పేసింది
రూపాలి
అయ్యో అంత మాటాలెందుకులే పిన్ని
నేను బుధవారం రాత్రిలోగా వచేస్తాలే
నువ్వేం కంగారుపడకు
అయినా కూడా నాకు బాబాయ్ నిమిష పెళ్లిచూపులు విషయం చెప్పనేలేదు
చెప్తే రానని ఎందుకంటాను చెప్పు
పిన్ని
నాకు తెలుసే నీ మనసు వెన్నపూస అని
సరే అయితే నేను నువ్వోస్తున్న విషయం మీ బాబాయ్ కి చెప్పాలి ఉంటాను
అనుకున్నట్లుగానే బుధవారం రాత్రి సంజీవ్ ఆఫీసు నుండి వచ్చాక రూపాలి బబాయ్ వాళ్ళ ఊరెళ్ళారు
★★★★★★★★★★★★★★
గురువారం రోజు ఉదయం నుండే ఇల్లంతా హడావిడి చేస్తూ తిరుగుతుంది పిన్ని
కానీ
ఏ పనీ చేసింది కాదు
అన్నీ రూపాలి వాళ్ళ అమ్మగారే చూసుకుంటున్నారు
పెళ్లి వాళ్లకు టిఫిన్స్ కూల్ డ్రింక్స్ అన్ని ఏర్పాట్లు చేసింది ఒంటి చేత్తో
ఏమైనా కావాలంటే అక్షయ్ సహాయంగా ఉన్నాడు అక్కడే
మరోవైపు
రూపాలి నిమిషను చాలా అందంగా రెడి చేసింది
అటు వైపుగా వచ్చిన బాబాయ్ కూతుర్ని చూసుకొని ఎంతో సంబరపడిపోయాడు
రూపాలి
ఎలా ఉంది బాబాయ్ నీ యువరాణి
చక్కగా రెడి చేసానా
బాబాయ్
నా కూతుర్లు పుత్తడి బొమ్మలురా
మీకు సరితూగే అందము ఎవ్వరికీ లేదు మన బంధువుల్లో
అయినా నువ్ అలంకరించాక ఇంకా అందులో వంకలు కూడా తీయగలమా
పిన్ని
మరేనండి
ఎంత అందంగా కనిపిస్తుందో నా కూతురు ఈ నగలతో
బాబాయ్
అవన్నీ ఎందుకు తెచ్చావమ్మా అల్లుడుగారు ఏమనుకుంటారో నీ నగలు దానికి వేస్తే
రూపాలి
ఆయన అలాంటివి పట్టించుకోరు బాబాయ్
మీరు అలా ఆలోచించకండి
అయినా నేనెప్పుడూ నిమిషను కుడా నా సొంత చెల్లెల్లాగే అనుకున్న
మీరు ఇలా మాట్లాడి మా మధ్య దూరం తీస్కురాకండి
అమ్మ
బాగా చెప్పవే
ఎంత ముద్దుగా కనపడుతుందో నా చిట్టి తల్లి ఉండు దిష్టి తీస్తా అని చూసి
ఏంటే రూప అన్నీ అలంకరించావు కానీ తలలో పూలెక్కడే
బాబాయ్
అయ్యో పూలు ఇంకా రాలేవు ఒదిన
నేను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తా అని వెళ్ళిపోయాడు
అమ్మ
రూపా నువ్వెంటే ఇంకా అలానే ఉన్నావ్
నువ్ కూడా రెడి అవు పో
రూపాలి
నేను ఉదయాన్నే రెడి అయ్యానమ్మ
అమ్మ
అంటే నువ్ ఇప్పుడు కూడా డ్రెస్ లో ఉంటావా
ఒక్కటిస్తా
వేళ్ళు వెళ్లి చక్కగా చీర కట్టుకునిరా
రూపాలి
అబ్బా అమ్మా
పెళ్లిచూపులు దానికైతే నేను చీర కట్టుకోవడం ఎందుకే
చంపుతున్నావ్ నీ చాదస్తంతో
అమ్మ
చెల్లి పెళ్లి చూపులకి అక్క డ్రెస్సులో ఉండటం బాగోదమ్మా
నా మాట విని చీర కట్టుకొ
ఇంకా చేసేదేమీలేక రూపాలి కూడా చీర కట్టుకుని వచ్చింది
పులకని వెళ్లిన బాబాయ్ కు ఎన్ని పూలు తేవాలి తెలియక మొత్తం పులా బుట్ట తెచ్చేసాడు
★★★★★★★★★★★★★★★★★
పులా బుట్టతో వస్తున్నా మరిదిని చూసి తెగ నవ్వుకుంటూ వచ్చింది రూపాలి అమ్మగారు
అమ్మ
ఏంటయ్యా మొత్తం పూల బుట్టనే తెచ్చావు
ఒక 5 మూరలు తెస్తే సరిపోయేవిగా
బాబాయ్
అయ్యో వదినా మీరందరూ పెట్టుకుంటారు అని తీసుకొచ్చా
చేసేదేమీ లేక అందరూ తలనిండా పూలు పెట్టుకొని రెడి అయ్యారు
నగలన్ని నిమిషకు వేయటం వల్ల
రూపాలి చిన్న పెర్ల్ సెట్ పెట్టుక
ొంది
ఎల్లో & లైట్ గ్రీన్ కలర్ సింపుల్ సారీలో కూడా ఎంతో అందంగా ఉంది
చూడగానే ఎవరికైనా నచ్చేంత
ఇంకా తలలో పెట్టిన మల్లెలతో అందం మరింత రెట్టింపైంది
★★★★★★★★★★★★★★
పెళ్ళివాళ్ళు వచ్చేసారు ఊర్లోకి అని కాల్ రావటంతో ఇంట్లో అందరూ తెగ హడావుడి చేస్తున్నారు
కానీ
నిమిషకు మాత్రం టెంక్షన్ తో చమటలు పెట్టేస్తున్నాయి
అక్కా అక్క అంటూ అరుస్తూ వచ్చింది నిమిష బయటకి
పిన్ని
ఒసేయ్ మొద్దు పెళ్ళివారు వచ్చే టైం లో నువ్ బయటాకేందుకు వచ్చావే
లోపలికి వేళ్ళు
నిమిష
అమ్మా అక్కను ఒక్కసారి తోరగా నా గదిలోకి రమ్మనవా అని చెప్పి వెళ్లిపోయింది
రూపాలి
ఏంటే పిలిచావంట
నిమిష
అక్క నువ్ ఇక్కడే ఉండవే నాకు ఎందుకో భయంగా ఉంది
రూపాలి
పిచ్చిదాన భయమెందుకు నీ చుట్టూ మేము ఉంటాముగా
అయినా ఇక్కడే నీతోనే ఉంటాలే బయపడకు
ఇంతలో పెళ్ళివారు ఇంట్లోకి వచ్చేసారు
వాళ్ళను కూర్చోపెట్టి
భార్యకు సైగ చేసాడు
టిఫిన్స్ అవి తీసుకురమ్మని
లోపలికి వెళ్లిన పిన్ని గారికి వాళ్ళ అమ్మ
టిఫిన్స్ నువ్ తీసుకెళ్లటం ఎందుకే అమ్మాయితో ఇప్పిద్దాం ఉండు నెను పిలుస్తా అని నిమిష గదికి వెళ్ళింది
అమ్మా
నిమిష వచ్చి వాళ్లకు పాలహారాలు ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది
నిమిష
అక్క నేను తర్వాత వస్తా కానీ
నువ్వెళ్ళి టిఫిన్స్ ఇచ్చేసి రావా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాదేసరికి
నిమిష టెంక్షన్ అర్ధం చేసుకున్న రూపాలి టిఫిన్స్ ఇచ్చేందుకు కిచెన్ లోకి వెళ్ళింది
అమ్మ
నువ్వొచావెంటే
రూపాలి
అబ్బా అమ్మా అది చాలా కంగారుపడుతుంది
నేను టిఫిన్స్ ఇచ్చేసాక దాన్ని తీస్కొచ్చి కూర్చోపెడతాలే
అమ్మ
సరేలే మీ ఇష్టం
రూపాలి
చిన్న స్మైల్ తో అందరికీ టిఫిన్స్ ఇస్తూ వెళ్తుంది
అందరూ రూపాలి వైపు చూసేసరికి
వాళ్ళ సందేహం అర్థం అయిన బాబాయ్ గారు
బాబాయ్
తనూ మా అమ్మాయి
అన్నయ్య కూతురు రూపాలి అని పరిచయం చేశాడు
రూపాలి
అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది
కాసేపటికి
నిమిషను తీసుకొని వచ్చి వాళ్ళ ముందర కూర్చోపెట్టి తను నిమిష వెనకే నిలుచుంది చెల్లెలు టెంక్షన్ గా ఉందని
అందరూ అమ్మాయిని చూశాక
అమ్మాయిని లోపలికి పంపమని చెప్పాడు పెళ్లిళ్ల పేరయ్య
మేము ఉరేళ్లక కాల్ చేస్తాం అని చెప్పి వెళ్లిన పెళ్లివాళ్ళు
ఊరి పొలిమేరలోనే కార్ అపుకొని బాబాయ్ కి ఫోన్ చేశారు
★★★★★★★★★★★★★★★
చెప్పండి పేరయ్య గారు
ఏమైనా చెప్పారా పెళ్లి వారు
మేము కూడా ఇంకా మా అమ్మాయి అభిప్రాయం తెలుసుకోలేదు
పేరయ్య
అయ్యా అదీ....అదీ...అదీ
బాబాయ్
ఏంటండి
విషయం ఏదైనా మీరు మొహమాటం లేకుండా చెప్పండి పర్వాలేదు
కట్నకానుకలు అయితే కనుక వాళ్ళు ఊహించనంత ఉంటుందని చెప్పండి
పేరయ్య 【 మనసులో】
వాళ్ళు మీరు ఉహించనిది చెప్పారని ఎలా చెప్పాలి
బాబాయ్
ఏంటండి
చెప్పండి
పేరయ్య
అయ్యా వాళ్ళకు మీ అమ్మాయి కంటే
మీ అన్నయ్య వాళ్ళ అమ్మాయి బాగా నచ్చిందంటా
అసలు అబ్బాయి అయితె మొదట ఆమెనే పెళ్లి కూతురు అనుకున్నాడంట
పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అని వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గొడవ
అందుకే
ఊరి పొలిమేరలోనే ఉండి ఫోన్ చేస్తున్నామయ్యా
మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని
ఆ అమ్మాయి తండ్రి నంబర్ ఇస్తే వెళ్లి సంబంధం మాట్లాడుకుంటారంట
బాబాయ్
అయ్యో దానికేం భాగ్యం ఇప్పుడే మీకు పంపుతా
అని ఒక నెంబర్ పంపాడు
పేరయ్య
నెంబర్ వచిందయ్య
బాబాయ్
మంచిది
కానీ అది మా అన్నయ్య నెంబర్ కాదు
పేరయ్య
మరి ఎవరిది
బాబాయ్
చెప్తానుగాని
ముందు మీరు స్పీకర్ ఆన్ చేయండి
అందరూ ఒకే సారి విందురు కానీ
పేరయ్య
చేశానయ్యా
చెప్పండి
బాబాయ్
అది మా రూపాలి భర్త నెంబర్
దానికి పెళ్లై 9 సంవత్సరాలు అవుతుంది
8 ఏళ్ల బాబు ఉన్నాడు చాలా
అంతే ఒక్క మాటతో పెళ్ళికొడుకుతో సహా అందరూ అవాక్కయ్యారు
★★★★★★★★★★★★★★★★★
మేము ఉరేళ్లక కాల్ చేస్తాం అని చెప్పి వెళ్లిన పెళ్లివాళ్ళు
ఊరి పొలిమేరలోనే కార్ అపుకొని బాబాయ్ కి ఫోన్ చేశారు
ఏంటండి
ఏమంటున్నారు పెళ్లి వాళ్ళు
అని వచ్చింది
బాబాయ్
సైలెంట్ గా ఉండేసరికి అందరూ కాస్త కంగారుగా చూస్తున్నారు
ఇంకా గట్టిగా నవ్వటం స్టార్ట్ చేసాడు
రూపాలి
అబ్బా బాబాయ్ టెంక్షన్ పెట్టకుండా చెప్పండి ముందు
బాబాయ్
వాళ్లకు మన నిమిష కాకుండా రూపాలి నచ్చిందంటా అంటూ నవ్వుతూనే ఉన్నాడు
ఈ సారి అందరూ అవాక్కాయినా
పడి పడీ నవ్వటం స్టార్ట్ చేశారు
సంజీవ్
బాబోయ్ నేను లేకుండా నా భార్యను పంపిస్తే
ఏకంగా ఇక్కదే పెళ్లి చేసుకుంటా అనేవాడేమో మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని రూపాలిని తీసుకొని వెళ్ళిపోయాడు సంజీవ్