gowthami ch

Tragedy

3  

gowthami ch

Tragedy

ఎదురుచూపుల ఎడారి

ఎదురుచూపుల ఎడారి

6 mins
559


"అమ్మా ఇంక మనకు మంచిరోజులు వచ్చినట్లే నాకు బీటెక్ లో మంచి మార్కులు వచ్చాయి. ఇంక ఎన్నో రోజులు ఉండవు మనకు ఈ కష్టాలు ఇంకొన్ని రోజులలో మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను , నిన్ను నాన్న ని బాగా చూసుకుంటాను , ఆ తర్వాత నాన్న కష్టపడి రిక్షా తొక్కవలసిన పనిలేదు , నువ్వు కూడా రాత్రి , పగలు నిద్రమానుకొని ఆ కుట్టు మెషిన్ కుట్టవలసిన పనిలేదు , అలానే తమ్ముడిని కూడా మంచి కళాశాలలో చేర్పించవచ్చు" అని ఆనందంగా చెప్తున్న తన కూతురి మాటలకి ఎంతో ఆనంధపడింది కోటమ్మ.


అయితే ఇన్నిరోజులూ మేము పడ్డ రెక్కల కష్టానికి మంచి ఫలితం రాబోతుందని ఎంతో సంతోష పడింది , ఆ రోజు అతిత్వరలో రావాలని ఎంతో మంది దేవుళ్ళకి ప్రార్ధనలు చేసింది , ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురు చూసారు అందరూ .


ఆ రోజు రానే వచ్చింది. సంధ్య తన ఉద్యోగ ప్రయత్నం కోసం హైదరాబాద్ వెళ్ళడానికి నిశ్చయించుకుంది. అక్కడ తను ఉండడానికి కావలసిన డబ్బు కోసం బయట అప్పు తెచ్చి కూతురుకి ఇచ్చి ఆనందముగా సాగనంపారు రాధయ్య మరియు కోటమ్మ . తాము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం రాబోతుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ దంపతులని విధి వెక్కిరించింది.


ఏమైందో ఏమో తెలియదుకానీ తన కూతురి మరణవార్త ఆమె చెవిన పడింది. ఉద్యోగంతో తిరిగి వస్తుందనుకున్న కూతురు ఇలా జీవంలేకుండా పడి ఉండడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది , కన్నీరు మున్నీరై విలపించింది.


ఎన్నో ఆశలతో పట్నం పోయిన పిల్ల ని ఇలా చూడవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు! విధి ఆడిన ఈ ఆటలో ఆ తల్లికి బిడ్డ

ని దూరంచేసి కడుపుకోత మిగిల్చింది . "తన జీవితం గురించి ఎన్నో కళలు కంటూ ఎంతో కష్టపడి చదివింది , ఇంత కష్టపడి చదివించిన మిమల్ని ఇంక మీదట కష్టపడకుండా చూసుకుంటాను ఆలా మీ ఋణం కొంతైనా తీర్చుకుంటాను నాన్న" అంటూ వెళ్ళింది. ఇంతలోనే ఇలా జరిగిపోయింది అంటూ తల బాదుకుంటూ ఏడిచాడు రాధయ్య . ఆ మరణ వార్త విని , ఊరు ఊరంతా విలపించింది.

******************************************


అది తూర్పూగోదావరి జిల్లా లోని మారుమూల చిన్న పల్లెటూరు రిక్షా తొక్కుతూ అప్పుడప్పుడూ కూలి పనికి పోతూ ఏదో తనకి వచ్చిన సంపాదనతో ఇల్లు నడిపేవాడు రాధయ్య . ఇంట్లో ఉంటూ ఏదో తనకి వచ్చిన కుట్టు మెషిన్ కుడుతూ భర్తకి తనవంతు సహాయము చేసేది కోటమ్మ . వీరికి సంధ్య , కిషోర్ అని ఇద్దరు పిల్లలు. ఎంత కష్టమైనా పర్లేదు మన పిల్లలు మనలాగా కాకూడదు మంచిగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలన్నది వాళ్ళ కోరిక. అదే కోరికతో తమకి ఉన్నంతలోనే పిల్లలిద్దరినీ చదివిస్తూ వచ్చారు. పదవ తరగతి వరకు పక్క ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించారు తరువాత కాకినాడ లో ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ లో మంచి మార్కులు రావడంతో మంచి కళాశాలలో బీటెక్ చేరడానికి నిర్ణయించుకుంది సంధ్య.


కళాశాల చదువు ఖర్చు అయితే గవర్నమెంట్ కడుతుంది కానీ ఉండడానికి , తినడానికి చాలా ఖర్చు అవుతుంది అంత డబ్బు ఎక్కడనుండి తీసుకురావాలో తెలియక సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు బాధ పదుతుండగా వాళ్ళ అమ్మ దగ్గరకి జాకెట్ లు కుట్టించుకోవడానికి వచ్చే ఒక పెద్దావిడ అప్పుడే అక్కడికి వచ్చింది.


" ఏంటి సంధ్య ఎలా ఉన్నావ్? ఇంటర్ ఐపోయింది కదా తరువాత ఏం చేద్దాము అనుకుంటున్నావు" అని అడిగింది. "ఎంసెట్ రాసాను ఆంటీ మంచి కళాశాలలో బీటెక్ సీట్ వచ్చింది" అంది సంధ్య. "అవునా అభినందనలు! నాకు చాలా ఆనందంగా ఉంది మీ అమ్మ , నాన్న ఇంత కష్టపడి చదివించినందుకు మంచి ఫలితం దక్కబోతుందన్నమాట , మంచిది". అంటుండగా....


"అవును అండి మంచి కళాశాలలో సీట్ అయితే వచ్చింది కానీ దానికి అయ్యే ఖర్చు మేము భరించగలమా! ఉండడానికి , తినడానికి చాలా అవుతుంది కదా దాని గురించే ఆలోచిస్తున్నాం. మరలా చిన్నోడు కూడా 10 వ తరగతికి వచ్చాడు వాడికి పెరుగుతున్నాయి ఖర్చులు ఏమి చేయాలో అర్ధం కావట్లేదు" అంది సంధ్య వాళ్ళ అమ్మ.


"అయ్యో ఈ మాత్రం దానికేనా మేమంతా లేము ! మమల్ని అడిగితే సాయం చేయమంటామా! ఒక ఊరి వాళ్ళం ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా! అందులోనూ మీరు ఎంత కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారో మేమూ చూస్తున్నాం కదా , మాకు కూడా బాగా చదువుకొనే పిల్లలంటే చాలా ఇష్టం మీరేమి బయపడకండి మా ఆయనతో చెప్పి మీ పాపకి అయ్యే ఖర్చు నేను ఏర్పాటుచేస్తాను.

ఇంకేమి ఆలోచించకుండా వెంటనే పాపని కళాశాలకు పంపండి" అంది .


ఆ మాట వింటున్న కోటమ్మ నోట మాట రాలేదు. ఆనందంతో ఏం మాట్లాడాలో అర్ధంకాక అందరూ ఆమెకి చేతులెత్తి దణ్ణం పెడుతూ "మీ మేలు ఈ జన్మలో మరచిపోలేము అండి దేవుడు ఎక్కడో లేడు మీలాంటి వాళ్ళ రూపంలోనే ఉంటారు." అని ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు.


సంధ్యని తీసుకొని వెళ్లి దగ్గరుండి కళాశాలలో చేర్పించి వచ్చారు వాళ్ళ అమ్మ , నాన్న. దానికి తగినట్లుగానే సంధ్య కూడా బాగా చదివేది. క్లాస్ లో అందరికంటే ముందుండేది అన్నింట్లో. వాళ్ళ ఉపాధ్యాయులు కూడా ఎంతగానో ఇష్టపడ్డారు సంధ్యని.


చక్కని సంస్కారం , పెద్దలంటే గౌరవం , ఎప్పుడూ నవ్వుతూ ఉండడం , అందరితో ప్రేమగా ఉండడం చూసి తన క్లాస్ లో కూడా చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు సంధ్య కి , ఇలా మొదటి సంవత్సరం పూర్తి అయింది. కళాశాల మొదటి స్తానం దక్కింది సంధ్య కి. ఇక రెండవ సంవత్సరం లోకి అడుగుపెట్టారు అందరూ . ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది సంధ్య ను ప్రేమించడం మొదలుపెట్టారు కానీ సంధ్య మాత్రం ఎవ్వరిని ఇష్టపడలేదు , కొంతమంది తనకి ఇష్టంలేదు అన్న తరువాత వదిలేశారు కానీ కొందరు అలానే వెంటపడ్డారు.


ఎన్ని సార్లు తనని ఇబ్బంది పెట్టినా కూడా ఎంతో ఓర్పుగా తిరస్కరించింది .ఆ మంచితనమే వాళ్ళని ఇంకా తనని ఇష్టపడేలా చేసింది . ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు వాళ్ళందర్నీ పిలిచి తన కుటుంబం గురించి అంతా వివరించి తన బాధ్యతల గురించి అందరికీ తెలియచేసి ఇటువంటి పరిస్థితిలో నేను ఎవ్వర్నీ ప్రేమించలేను దయచేసి స్నేహితులుగా ఉండిపోదాం అని ఎంతో నెమ్మదిగా అందర్నీ ఒప్పించింది.


ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన వెనక పడటం మాత్రం మానేశారు . ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు తను కళాశాల కి త్వరగా రావడంతో ఇంకా క్లాస్ లు మొదలు కావడానికి సమయం ఉండడంతో బయట కూర్చొని పుస్తకం లో మునిగిపోయింది.


అటుగా వెళ్తున్న వాళ్ళ ఉపాధ్యాయులలో ఒకరు సంధ్య ని చూసి ఆగి , దగ్గరకి వచ్చి "అమ్మ సంధ్య నువ్వు ఏదో ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు మన సుందరం మాస్టర్ చెప్పారు. ఒక ఉద్యోగం ఉంది చేస్తావా?" అని అడిగాడు.


ఎంతో ఆనందం గా "అదేంటో చెప్పండి సర్ ఇప్పుడే వెళ్లి చేరుతాను" అంది సంధ్య , "అది ఎక్కడికో వెళ్లి చేయవలసిన పని లేదు అమ్మ , ఇక్కడే మన కళాశాలలో ఉండే చేయవలసింది. నీ క్లాస్సెస్ అన్ని అయిన తరువాత ఒక సారి నాకు కనపడు ,వివరాలు చెప్తాను" అని అక్కడినుండి వెళ్ళిపోయాడు. సంధ్య ఆనందానికి అవధులు లేవు ఎంతో ఆనందంగా అనిపించింది తనకి , ఇంక మా అమ్మ నాన్న కి కొంత భారం తగ్గించిన దానిని అవుతాను అనుకుంటూ క్లాస్ లోకి వెళ్ళిపోయింది.


వాళ్ళ సర్ చెప్పినట్లుగానే తన క్లాస్సెస్ అన్నీ అయిన తరువాత ఆయన దగ్గరకి వెళ్లింది.


"హ.. సంధ్యా వచ్చావా లోపలికి రా" అని లోపలికి పిలిచాడు , "చెప్పండి సర్ ఏమిటి మీరు చెప్పిన పని ఏం చేయాలి నేను" అని అడిగింది సంధ్య. "ఏం లేదు సంధ్య మన కళాశాలలో ఎంతో మంది అనాధలకి ఉచితంగా విద్య ని అందిస్తున్నాం కదా వారిలో కొందరు చాలా వెనుకబడి ఉన్నారు. సాయంత్రం సమయం లో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళని బాగా చదివేలాగా చేయాలి దానికి నీకు తగిన జీతం ఇవ్వలేము కానీ నువ్వైతేనే వాళ్ళకి చక్కగా అర్ధమయ్యేలాగా చెప్పగలవు అని నీకు చెప్తున్నాను అదికూడా నీకు అంగీకమైతేనే" అన్నారు . ఏమి ఆలోచించకుండా "సరే సర్ ఎప్పటి నుండి మొదలు పెట్టమంటారు క్లాస్సెస్ "అని అడిగింది.


నవ్వుతూ , "నీ ఇష్టం నీకు ఏ రోజు వీలైతే ఈరోజే మొదలుపెట్టు ఆలోగా దానికి కావలసిన క్లాస్ రూమ్ తయారు చేయిస్తాను" అన్నాడు. "సరే సర్" అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది సంధ్య .


బయటకి వచ్చి ఇలా అనుకుంది. "నేను ఏదైనా ఉద్యోగం చేస్తూ చదువుకుందాం , ఆ వచ్చిన జీతం తో కొంతైనా ఇంట్లో వాళ్ళకి భారం తగ్గిద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం కి జీతం ఏమి ఉండదు కదా , అయినా ఆ అనాధలకి ఈ రకం గా అయినా నా వంతు సహాయం చేసిన దాన్ని అవుతాను , అంతకన్నా ఇంకేం కావాలి" అనుకుంది.


ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు తన క్లాస్సెస్ , అవి అయిపోయిన వెంటనే వీళ్ళకి క్లాస్సెస్ చెప్పడం ఇదే తన దిన చర్య గా మారింది. కొంత కాలం లోనే వాళ్లంతా చాలా చక్కగా అన్నీ నేర్చుకోవడం ,అందర్నీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా చూస్తూ చూస్తూ తన చివరి సంవత్సరం పరీక్షలు కూడా అయిపోవడంతో ఆ కళాశాల లో వీడ్కోలు సభ ఏర్పాటు చేసారు. అందరికీ వీడుకోలు చెప్పి ఇంటికి వచ్చేసింది సంధ్య .


కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళతో సమయం గడిపిన తరువాత ఉద్యోగ ప్రయత్నం కోసం మరలా పట్నం వెళ్ళవలసి వచ్చి అందరికి వీడ్కోలు చెప్పి బయలుదేరింది సంధ్య .


ఎన్నో ప్రయత్నాలు చేసింది ఉద్యోగం కోసం. ఒక్క రోజు కూడా వృధా కాకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది , చేతిలో డబ్బులు అయిపోతున్నాయి , ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి బాధ పడింది. "ఎలాగైనా సరే ఒక మంచి ఉద్యోగం వస్తే గాని ఇంటికి వెళ్ళకూడదు" అని నిర్ణయించుకుంది.


ఉదయం ఎప్పుడో వెల్లి సాయంత్రం ఎప్పుడో వచ్చేది గదికి . ఎప్పుడు తింటుందో ,ఎక్కడ తింటుందో కూడా తెలియకుండా కనపడిన ప్రతి కంపెనీ కి వెళ్లి ఉద్యోగం కోసం అడిగింది. ఒకరోజు ఎక్కడో కొత్తగా కంపెనీ పెడుతున్నాం కొత్త వాళ్ళు కావాలి అన్న ప్రకటన చూసి వెంటనే అక్కడికి వెల్లింది. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ అటువంటి ఆఫీస్ ఏమి లేదు!


సరే అని వెనుతిరిగి వస్తుండగా ఒక అతను వెనకనుండి చెయ్యి లాగి ఆపాడు. ఎవరా అని అటువైపుకి తిరిగి చూసింది. అతను ఎవరో కాదు కళాశాలలో తనని ప్రేమించిన వాళ్ళలో ఒకడైన రోహిత్.


"హయ్ రోహిత్ నువ్వా ! ఎలా ఉన్నావ్ , నువ్వేన్టీ ఇక్కడ ! నువ్వు కూడా నాలాగే ఈ ఉద్యోగం కోసం వచ్చావా?" అని అడిగింది నవ్వుతూ .


"లేదు నిన్ను ఇక్కడికి రప్పించడానికే నేను ఇలా చేసాను అంటూ తన చెయ్యి పట్టుకొని లాగబోయాడు." ఇంతలో పరిగెత్తి పారిపోయింది. అయినా వదలకుండా వెంట పడ్డాడు.


పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక గోడ పక్కన నక్కి కూర్చుంది. వెతికి వెతికి అలసిన రోహిత్ అలసిపోయి వెళ్ళిపోయాడు.


"హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి తప్ప ఉద్యోగం రావడంలేదు. ఓపిక నశించింది. డబ్బులు అయిపోయాయి ఇంట్లో వాళ్ళ కష్టం గుర్తొచ్చి ఏడ్చింది. సంవత్సరం గడిచింది.


ఇలా చదువుకి తగ్గ ఉద్యోగం కోసం చూడడం కన్నా వచ్చిన ఏ పనైనా చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకొని చదువుకి సంబంధం లేకుండా తను చేయగలిగే ప్రతి ఉద్యోగానికి ప్రయత్నించింది. చివరకు తన ఎదురుచూపులు ఫలించి ఒక ఉద్యోగం సాధించింది.


ఆ ఆనందం మొదట ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్న ఆత్రంలో రోడ్ క్రాస్ చేస్తున్న సంధ్య ని ఒక లారీ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. అంతవరకు ఆనందంగా ఉన్న మొఖం రక్తంతో తడచి అక్కడికక్కడే ప్రాణం పోయింది. తెల్లవారే సరికి ఒక సూర్యుడు ఉదయించాడు ఒక సంధ్య అస్తమించింది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy