Lahari Mahendhar

Comedy Drama Children

3.8  

Lahari Mahendhar

Comedy Drama Children

బుజ్జిగాడి ఇన్నర్ వాయిస్

బుజ్జిగాడి ఇన్నర్ వాయిస్

5 mins
231


హాయ్ అండీ

మనం పిల్లలు ఏదైనా అల్లరి పని చేస్తున్నప్పుడు లేదా వాళ్ళను మందలించినప్పుడు కాస్త పెద్ద పిల్లలు అయితే ఏడుపు మొహం పెట్టి ఏడ్చేస్తారు...

కానీ మాటలు రాని బోసి నవ్వుల పాపాయి అయితే...

వాళ్ళ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు....

అలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్ లను మా బుజ్జిగాడి ఇన్నర్ వాయిస్ లో చూడండి.... సోరి....సోరి...చదవండి

ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే బుజ్జిగాడి మాటలు అన్నీ కూడా వాడి ఇన్నర్ వాయిస్...

ఎందుకంటే మా బుజ్జిగాడికి ఇంకా నోట్లో పళ్లే రాలేదు మరి మాటలు ఎలా వస్తాయండి

★★★★★★★★★★★★

లతకు కిచెన్లో కొంచెం పని ఉండడం వలన

బుజ్జిగాడి ముందు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు వేసి వెళ్ళింది...

కానీ అనుకోకుండా బుజ్జిగాడి బొమ్మలతో పాటు ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా అందులో ఉండిపోయింది...

తాలింపు పెడుతూ కరివేపాకు కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన లత...

బుజ్జిగాడు మెడకు కాళ్ళకు చేతులకు ఎక్స్టెన్షన్ బాక్స్ లోని వైరు చుట్టుకుని ఉండటం చూసి ఎంతో కంగారుగా వచ్చి...

బొమ్మలతో ఆడుకో మంటే ఈ వైర్ తో ఆటలు ఏంటిరా పొట్టి బుడంకాయ్ అంటూ చిన్నగా మందలిస్తున్నట్టుగా బుజ్జిగాడు మెడ నుండి జాగ్రత్తగా వైర్ బయటకు తీసి ...దాన్ని ఆ ఎక్స్టెన్షన్ బాక్స్ లోకి చుడుతుంది...

అలా వైర్ ని లోపలికి చుడుతున్న లతను చూస్తూ ఉన్నాడు బుజ్జిగాడు...

ఇందాక నేను ఎంచక్కా మెడలో మాలలా వేసుకుని ఆడుకుంటే నన్ను తిట్టింది...

ఇప్పుడు మమ్మీ చూడు ఎలా ఆడుకుంటుందో....

నాకు తెలిసి మమ్మీ ఆడుకోవడానికే నా దగ్గర నుండి ఆ వైర్ బాక్స్ లాగేసుకుని ఉంటుంది...

లతకి కిచెన్లో స్టవ్ మీద ఉన్న పప్పు గుర్తొచ్చి...

బుజ్జిగాన్నీ వాకర్లో వేసి తనతోపాటు కిట్చేన్లోకి తీసుకెళ్ళింది...

లతను కొరకొరా మింగేసేలా చూస్తూ లత చేసే పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు బుజ్జిగాడు...

ఆమె ఎక్కడి నుండి ఏ గరిట తీస్తుంది...

పప్పు ఎలా రుద్దుతుంది...చాలా నిశితంగా గమనిస్తున్నాడు....

ఇంతలో బయట నుండి మినరల్ వాటర్ అబ్బాయి క్యాన్లో వాటర్ పోసి... మేడం సైన్ అని పిలవగానే అటుగా వెళ్ళింది లత...

లత సైన్ చేసి ఆ అబ్బాయికి కొంచెం వార్నింగ్ ఇచ్చి లోపలికి వచ్చి చూసేసరికి కిచెన్ పరిస్థితికి అవాక్కయిపోయింది....

ఒరేయ్ ఒరేయ్ బుజ్జిగా నేను వెళ్ళింది ఐదు నిమిషాలు కదరా అయిదు నిమిషాల్లో కిచెన్ ఇలా కిష్కిందకాండలా మార్చేసావ్ ఏంట్రా...

ఇంతకీ మన బుజ్జిగాడు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా....

వాడి వాకర్ తో గబగబా పరుగెత్తుకు వెళ్ళి చాలా కష్టపడి ఒక గరిట తీసుకున్నాడు...

అంటే వాడు కొంచెం కష్టపడితే అందేంత హైట్ లో ఉంది లెండి...

ఆ గరిటతో వాళ్ళ మమ్మీ వచ్చేలోపు టాస్క్ కంప్లీట్ చేయాలి అని వీలైనన్ని ఎక్కువ గిన్నెలు ప్లేట్లు అన్నీ కింద పడేసాడు...

ఆ తర్వాత పై వరుసలో ఉన్న షుగర్ డబ్బా దాంతో పాటు టీ పొడి కూడా పారబోశాడు....

ఇంకేముంది షుగర్ టీ పొడి రెండూ కలిసి వాణ్ణి అభిషేకించాయి...

లత రావడం కాస్త ఆలస్యమై ఉంటే కారం డబ్బా కూడా పడేసే వాడే....

కానీ లతను చూడగానే టాస్క్ ఇన్ కంప్లీట్ అనే డిసప్పాయింట్మెంట్ కనబడింది వాడి కళ్ళలో...

వేధవ ఇంకా నడవడం కూడా రాలేదు... అప్పుడే నాకు నరకం చూపిస్తున్నావు కదరా...ఉసూరుమంటూ వాన్ని ఫ్రెష్ చేయడానికి తీసుకెళ్ళింది...

బుజ్జిగాడు

వదలవే మమ్మీ... వదులు నువ్వు ఇందాక గరిటేతో ఆడున్నంతసేపు నేను నీకు అడ్డు వచ్చానా...

నన్ను మాత్రం ప్రశాంతంగా ఫైవ్ మినిట్స్ కూడా ఆడుకోనివ్వవ్వు డాడీరానీ నీ సంగతి చెప్తా...

బుజ్జిగాడి బట్టలు తీసేసి బాత్టబ్లో కూర్చోబెట్టి...

మనవాడు ఘనకార్యం చేసిన బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తే ఆ షుగర్ టీ పొడి ఇరుక్కుని వాషింగ్ మిషన్ పాడవుతుందేమోనన్న భయంతో...

ఒక బకెట్లో డేటాల్ సర్ఫ్ వేసి వాడి బట్టలు అందులో నానపెట్టింది...

బుజ్జిగాడు

ఓహో నీ బట్టలు డాడీ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుకుంటారా... నా బట్టలు అయితే బకెట్లో వేస్తావా... అంతేనే నీకు నాకంటే డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం...

పోనీలే కనీసం నన్ను ఈ బాత్టబ్లో అయినా వేసావ్ కాసేపు నీళ్లతో ఆడుకుంటాను....

లత తలతిప్పి చూసే వరకు బాత్ టాబ్ నిండా నురగే...

ఎందుకంటే మన బుజ్జిగాడు బిజీగా షాంపూ బాటిల్ మొత్తం బాత్టబ్లో పిండేసాడు....

ఆ నురగ ఎక్కడ వాడి కళ్ళల్లోకి వేలుతుందో అని వాన్నీ ఫాస్ట్ గా అందులో నుండి తీసి స్నానం చేయిస్తుంది...

బుజ్జిగాడు

ఇందాక నువ్వు బకెట్లో డెటాల్ సర్ప్ అన్నీ వేసి నురగతో ఆడుకున్నప్పుడు లేదుగానీ...

నేను బాత్టబ్లో జస్ట్ వన్ బాటిల్ షాంపూ వేస్తే వచ్చిందా...

చూస్తున్నానే మమ్మీ అన్ని అబ్జర్వ్ చేస్తున్నా....

నేను పెద్దయ్యాక నువ్వు చిన్నగా అయిపోతావ్ కదా అప్పుడు నీ సంగతి చెప్తాను...

లత వాడికి స్తానం చేయించి టవల్ కట్టి లోపల వదిలేసి వచ్చి బట్టలు దండం మీద వేసి లోపలికి వెళ్ళేసరికి...

దాదాపు సున్నపు తేటలో పిడక ముక్క పడినట్టుగా ఉంది వాడి ముఖం...

ఫుల్ గా పౌడర్ కొట్టుకుని మొహమంతా కాటుక పూసుకుని వాళ్ల మమ్మీ కేసి చూస్తూ బోసినవ్వు నవ్వుతున్నాడు....

ఏరా కనీసం నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వవా...

ఎందుకురా ఇప్పటినుండి ఇంత సాధింపు నామీద...

అంటూ టిష్యూతో మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ గా రెడీ చేసి బట్టలు వేసింది....

అయ్యయ్యో ఎందుకే మమ్మీ నా మేకప్ అంతా అలా తీసేస్తున్నావ్ ఎంతో కష్టపడి వేసుకున్నాను...

నీ మొహానికి ఒక్కసారైనా నన్ను ఇలా రెడీ చేశావా....

పక్కింటి స్వప్న అంటీని చూడు....

ఇంత పెద్ద బొట్టు పెట్టి కళ్ళకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి హిమని ఎంత చక్కగా రెడీ చేస్తుందో

ఇంతలో పవన్ ఆఫీస్ నుండి వచ్చాడు...

పవన్ వస్తూ వస్తూనే...

లత చాలా ఆకలిగా ఉందోయ్ త్వరగా వడ్డించు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను...

అని చెప్పి వాష్ రూం లోకి వెళ్ళిపోయాడు

చూడు పవన్ వంట రెడీగా ఉంది...

మార్నింగ్ నుండి ఇప్పటివరకు నీ పుత్రరత్నం నాకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు

నువ్ ఫ్రెష్ అయి వచ్చి బుజ్జిగాన్నీ తీసుకుంటే...

నేను ఫ్రెష్ అవుతాను అప్పుడు ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం....

పవన్ ఫ్రెష్ అయి వచ్చి బుజ్జిగాన్నీ తీసుకొని వాడితో ఆడుకుంటున్నాడు....

ఏమైంది నా బుజ్జితండ్రికి ఎందుకు మమ్మీ నిన్ను అలా అంటుంది....వీడు నా బంగారు కొండ

బుజ్జిగాడు

అబ్బ ఎంత మంచి వాడివి డాడీ...

మమ్మీ ఇలా నన్ను ఒక్కసారైనా మెచ్చుకోదే...

పైగా ఎప్పుడూ పొట్టి బుడంకాయ వెధవ అంటూ తిడుతూ ఉంటుంది...

డాడీ మీ ఆవిడ పైకి కనపడే అంత మంచిది కాదు జాగ్రత్త...

ఫ్రెషప్ అయి వచ్చిన లత...

పవన్ ఇంకా ఫైవ్ మినిట్స్ వాన్ని అలాగే పట్టుకో నేను డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేస్తాను...

డైనింగ్ టేబుల్ మీద వద్దు లత...

కిందే భోంచేద్దామ్ డైనింగ్ టేబుల్ మీద అయితే బుజ్జిగాడిని పట్టుకొని తినడం కష్టంగా ఉంటుంది

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కాస్తన్ని వడియాలు కూడా తీయు ముద్దు పప్పులోకి బాగుంటాయి...

అప్పటికీ నేల మీద అన్నం పప్పు ప్లేట్స్ అన్ని పెట్టిన లతా వడియాలు తీయటానికి కిచెన్ లోకి వెళ్ళింది...

ఇంతలో పవన్ కి ఏదో కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ బుజ్జిగాన్నీ కింద వదిలేసి పక్కకు వెళ్ళాడు...

వడియాలతో డైనింగ్ హాల్ కి వచ్చిన లత...

పవన్... పవన్... అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది...

లత అరుపులతో లోపలికి వచ్చి చూసిన పవన్

బుజ్జిగాడు చేస్తున్న పనికి కళ్ళు తెరిచి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు...

ఇంతకీ మన లిటిల్ హీరో చేసిన పని ఏంటో తెలుసా...

మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు

వీడు ఫ్లోర్ కి పప్పు ప్యాక్ వేస్తూ కనిపించాడు

సారీ లత నేను ఏదో అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడుతూ పక్కకు వెళ్ళాను... వీడు ఇంతలోనే ఇంత పని చేస్తాడని అనుకోలేదు....

వీటి గురించి నాకు బాగా తెలిసే నిన్ను చూసుకోమని చెప్పి మరీ వెళ్లాను...

అంటూ పాపం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొంటోంది లత...

బుజ్జిగాడు

నువ్వు నేను చూస్తుండగానే కదే మమ్మీ పప్పుతో ఆడుకున్నావ్...

నిన్ను చూసే నేను ఈ ఆట నేర్చుకున్నాను...

అలాగే ముగ్గు అంతా వాకిట్లో పారబోసే నువ్వు... నేను ఈరోజు నీకంటే అందంగా పప్పుతో ముగ్గు వేశానని చూసి ఓర్వలేక పోతున్నావ్...

నువ్వేం చేస్తావో నాకు తెలియదు పవన్...

కనీసం అన్నం తినేటప్పుడు అయినా కాస్త ప్రశాంతంగా తినేలా వీన్ని ఆ వాకర్లో వేసేయ్...

పవన్ ఒక రాడ్ కి వాడి వాకర్ తగిలించి అటో చేర్ ఇటో చేర్ వేసి వాటిమీద ఆ రాడ్ ని పెట్టాడు...

ఇంకేముంది మన బుజ్జిగాడి కాళ్ళు నేలను తాకడం లేదు నేల నుండి జానెడు ఎత్తులో గాలిలో తెలుతున్నాయి...

బుజ్జిగాడు

ఒరేయ్ డాడీ నువ్వు మీ ఆవిడను మించి పోయావు కదా శాడిజంలో

నన్ను ఇలా ఎటు కదలనివ్వకుండా చేసి మీరు ప్రశాంతంగా అన్నం తింటారా...

చూస్తారా చూస్తారా సినిమాలో హీరో లాగా...

నేను ఏ సైకిల్ తొక్కుతూనో... లేదా పరిగెత్తుతూ పరిగెత్తుతూనో రేపటిలోగా పెద్దవాన్నైపోతా అప్పుడు చూస్తా మీ ఇద్దరి సంగతి...

హోరున తుఫాన్ వచ్చి పోయాక ఎలా ఉంటుందో అలా ఉంది ఇల్లు ఇప్పుడు...

పాపం పవన్ లతా కాసేపైన ప్రశాంతంతో అన్నం తింటున్నారు....

దయచేసి మా బుజ్జిగాడి పాత్రలో కేవలం హాస్యాన్ని మాత్రమే చూడండి...

ఇది ఎవరి మనోభావాలను దెబ్బ తీయడానికి రాసిన కథ కాదు...

ముఖ్యంగా ఐదు నెలల వయసు నుండి 9 నెలల వయసు ప్రజ్ఞావంతులను నేను అసలే కించపరచడం లేదు....Rate this content
Log in

Similar telugu story from Comedy