gowthami ch

Horror

2.8  

gowthami ch

Horror

భయానక స్వప్నం

భయానక స్వప్నం

2 mins
1.8K


"ఏంటి... కిరణ్ ఇంకా ఎంతసేపు?" అంటూ విసుగ్గా అడిగింది కీర్తన.


"కార్ స్టీరింగ్ తిప్పుతూ బుజ్జగింపుగా కీర్తన వైపు చూసి ఇంకొంచెం సేపు ఓపిక పట్టు కీర్తన దగ్గర్లోనే ఉన్నాం" అన్నాడు కిరణ్.


కార్ వేగంగా ముందుకు వెళ్తుంది. రేడియో లో నవ్వింది "మల్లె చెండు...నచ్చింది గర్ల్ ఫ్రెండ్...." అంటూ వస్తున్న పాట వింటూ శృతి కలిపాడు కిరణ్.


"ఈ పాటలో ఎంతో ఎనర్జిటిక్ గా డాన్స్ వేశాడు కదా చిరంజీవి. నా అల్ టైం ఫేవరేట్ సాంగ్ ఇది , అదేంటో తెలియదు కానీ ఈ పాట ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఊపు వస్తుంది. ఏమంటావ్ కీర్తన?" అంటూ తల పక్కకి తిప్పి చూసేసరికి కీర్తన నిద్రపోతూ ఉండడం చూసి మెల్లిగా పాట సౌండ్ తగ్గించి విండోస్ అన్నీ మూసేసి ఏసీ ఆన్ చేసాడు.


టైర్ పంచర్ అయిన శబ్దం వినపడి ఉల్లికి పడి లేచి "ఏమైంది కిరణ్" అంటూ భయంగా అడిగింది కీర్తన. "ఏమీ లేదు కీర్తన టైర్ పంచర్ ఐనట్లుంది నువ్వేమి కంగారు పడకు నేను వెళ్లి చూస్తాను" అంటూ కార్ దిగి చూసేసరికి కార్ టైర్ పంచర్ అయింది.

డిక్కీ లో నుండి స్టెప్నీ తీసి టైర్ మార్చే పనిలో పడ్డాడు కిరణ్.


మెల్లగా నిద్రలోకి జారుకుంది కీర్తన. ఒక్కసారిగా వీది దీపాలు అన్ని టపా.. టపా... అంటూ పేలిపోయి ఆ ప్రాంతమంతా అమావాస్య చీకట్లు అలుముకున్నాయి. కార్ రిపేర్ చేస్తున్న కిరణ్ కి ఏమి కనపడడం లేదు భార్యని లేపి సహాయం చేయమని అడగడానికి మనసు రాక ఫోన్ ఆన్ చేసి లైట్ వేసుకొని ఆ వెలుతురులో కార్ టైర్ మారుస్తున్నాడు.


బాగా రాత్రి కావడంతో రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఏవో దారిలో వెళ్లే కొన్ని వాహనాలు తప్ప మరేమీ కనపడట్లేదు. కుక్కలు విచిత్రంగా ఏడుస్తున్న శబ్దం స్పష్టంగా వినపడుతోంది.


త్వరత్వరగా టైర్ మార్చేసి వచ్చి కార్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కోసం సీట్ బెల్ట్ లాగాడు. వాయు వేగంతో వస్తున్న ఒక లారీ క్షణాలలో వెనక నుండి కార్ ని గుద్దేసి వెళ్ళిపోయింది.


కార్ కొంత దూరంలో ఎగిరి పడింది. కళ్ళు మూసి తెరిచే లోపే ఆ ప్రాంతమంతా రక్తంతో తడిచిపోయుంది. మూసిన కళ్ళు తెరవకుండానే అనంత వాయువులో కలిసిపోయింది కీర్తన. కొంత సేపటికి తేరుకొని ఒంటి నిండా గాయాలతో ఉన్న కిరణ్ , భార్యని సమీపించి లేపడానికి ప్రయత్నించాడు కానీ లేవలేదు. పక్కనే కింద పడి ఉన్న వాటర్ బాటిల్ లో ఉండే కొన్ని నీళ్లు తీసి భార్య మోహాఁ మీద చల్లాడు.


హటాత్తుగా ఉలిక్కిపడి కళ్ళు తెరచిన కీర్తన కిరణ్ ని చూసి భయం భయంగా ఒళ్ళంతా తడుముతూ "నీకేమి కాలేదు కదా కిరణ్" అని అడిగింది.


అలా ఖంగారు పడుతున్న కీర్తన భుజం మీద చెయ్యి వేసి. "ఏమైంది కీర్తన ఏదైనా కల కన్నావా ఏంటి. " అడిగాడు కిరణ్.


"అంటే, ఇదంతా నా కలనా!?..హమ్మయ్యా....నీ కేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా కిరణ్? ఇంత భయంకరమైన కల నా జీవితంలో ఇదే మొదటి సారి." అంటూ కల మొత్తం వివరించింది.


"నిజ జీవితంలో జరగనివే కలగా వస్తాయి అంటారు. ఇంక దాని గురించి వదిలై , మనం దిగాల్సిన చోటు వచ్చింది. ఇప్పటికైనా దిగుతారా? లేక ఇలానే కూర్చొని రాత్రంతా కలలు కంటూ ఉంటారా?..."నవ్వుతూ అడిగాడు కిరణ్.


"అమ్మో!!... ఇంకానా....!!! నా వల్ల కాదు బాబోయ్, పద త్వరగా లోపలికి వెళదాం" అంటూ కార్ దిగి కిరణ్ చెయ్యి పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది కీర్తన.


Rate this content
Log in

Similar telugu story from Horror